Kumaram Bheem Asifabad: వివాదాలకు చర్చలతోనే పరిష్కారం
ABN , Publish Date - Nov 23 , 2026 | 11:14 PM
కౌటాల/పెంచికల్‌పేట్, నవంబరు 23 (ఆంధ్ర జ్యోతి): చిన్నచిన్న వివా దాలు చిలికిచిలికి గాలివా నలా మారి కుటుంబాలు, సమాజంలో అశాంతికి దారితీయకుండా పరస్పర చర్చలు, అవగాహనతో పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ(డీఎల్‌ఎస్‌ఎ) కార్యదర్శి,జిల్లా సీనియర్ సివిల్‌జడ్జి జి అనూష సూచించారు.
- సీనియర్ సివిల్ జడ్జి జి అనూష
కౌటాల/పెంచికల్‌పేట్, నవంబరు 23 (ఆంధ్ర జ్యోతి): చిన్నచిన్న వివా దాలు చిలికిచిలికి గాలివా నలా మారి కుటుంబాలు, సమాజంలో అశాంతికి దారితీయకుండా పరస్పర చర్చలు, అవగాహనతో పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ(డీఎల్‌ఎస్‌ఎ) కార్యదర్శి,జిల్లా సీనియర్ సివిల్‌జడ్జి జి అనూష సూచించారు. కౌటాల, పెంచికల్‌పేట్‌లో ఏర్పాటుచేసిన సమావేశం లో ఆమె మాట్లాడారు. సమస్యల పరిష్కారా నికి కోర్టుల చుట్టూ తిరగటం ఒక్కటే మార్గం కాదని, ఇరువర్గాల మధ్య చర్చలు, రాజీద్వారా కూడా సత్వరపరిష్కారం సాధ్య మని పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సామాజిక సామరస్య పరిష్కార కేంద్రం (సీఎంసీ)ను ఆమె ప్రారంభించారు. దాని ఉద్దేశాలు, విధివిధానాలు, ప్రజలకు అందిం చే సేవలపైఅవగాహణ కల్పించారు. గ్రామీ ణ ప్రాంతాల్లో కుటుంబ, వ్యక్తిగత సామాజిక కారణాలతో తలెత్త వివాదాలను ప్రారంభ దశలోనే పరిష్కరించుకోవటం ద్వారా అనవ సరమైన ఘర్షణలకు తావులేకుండా చేయవ చ్చన్నారు. ఈ కేంద్రాల సేవలను సద్విని యోగం చేసుకొని గ్రామాల్లో ప్రశాంతవాతా వరణం నెలకొల్పేందుకు సహకరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌటాల తహసీ ల్దార్ ప్రమోద్‌కుమార్, సూపరింటెండెంట్ ఛైర్మన్ దేవయ్య, ఏఎస్‌ఐ రాజాగౌడ్, ఎస్‌వో కవిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.