Share News

కుట్రలు చేస్తే సహించేది లేదు.. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ హెచ్చరిక

ABN , Publish Date - Aug 06 , 2026 | 11:55 PM

ఆసిఫాబాద్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాకాంగ్రెస్‌ పార్టీలో వ్యక్తిగతస్వార్థం, పద వులకోసం కొందరు కావాలనే వర్గవిభేదాలను రెచ్చగొడుతూ పార్టీని బలహీనపరిచే కుట్రచే స్తున్నారని

కుట్రలు చేస్తే సహించేది లేదు.. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ హెచ్చరిక

- డీసీసీ అధ్యక్షురాలు సుగుణ

ఆసిఫాబాద్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాకాంగ్రెస్‌ పార్టీలో వ్యక్తిగతస్వార్థం, పద వులకోసం కొందరు కావాలనే వర్గవిభేదాలను రెచ్చగొడుతూ పార్టీని బలహీనపరిచే కుట్రచే స్తున్నారని దీనిని ఎట్టి పరిస్థితి లో సహించేదిలేదని డీసీసీ అఽధ్య క్షురాలు ఆత్రంసుగుణ అన్నారు. గురువారం ముఖ్యనాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె మాట్లాడారు. మాజీడీసీసీ అధ్య క్షుడు విశ్వప్రసాద్‌రావు, మాజీఎమ్మెల్యే ఆత్రంసక్కు కలిసి కొంతమంది కార్యకర్త లను ప్రలోభాలకు గురిచేసి అభివృద్ధి పను లు ఇప్పిస్తామంటూ హైదరాబాద్‌ గాంధీ భవన్‌కు తీసుకువెళ్లి తనపై ఆరోపణలు చేయించారని ఆమె ఆరోపించారు. తనను నాన్‌లోకల్‌ అనడం రాజకీయ దివాల కోరు తనానికి నిదర్శణమన్నారు. తాను సిర్పూర్‌ (యూ)మండలంలోనే జన్మించినట్లు గుర్తు చేశారు. పార్టీనిదిక్కరించి అదిష్ఠానం నిర్ణ యాలను బహిరంగంగా వ్యతిరేకిస్తున్న వారిపై తగిన సమయంలో తగిన నిర్ణయం తీసు కుంటుందని తెలిపారు. సమావేశంలో మార్కెట్‌కమిటీచైర్మన్‌ మంగ, పార్టీమండల అధ్యక్షులు మురళీ, ఇమ్రాన్‌, సుజీయత్‌, రశీద్‌, కిషన్‌గౌడ్‌, గణపతి,మెంగాజీ, మున్సి పాలిటీ ఫ్లోర్‌ లీడర్‌ అబ్దుల్లా, జిల్లా కార్యవర్గ సభ్యులు గాదవేణి మల్లేష్‌, తారీక్‌, భీంరావు, శోభన్‌, చిరంజీవి, ప్రకాష్‌, బాదుపటేల్‌, శంకర్‌, నాంపల్లి శంకర్‌,ఇందిర పాల్గొన్నారు.

Updated Date - Aug 12 , 2026 | 11:03 AM