Share News

Kumaram Bheem Asifabad: ఆసిఫాబాద్‌ ఏజెన్సీలో చలి పంజా

ABN , Publish Date - Nov 19 , 2026 | 11:56 PM

ఆసిఫాబాద్‌, నవంబరు 19 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో చలి పంజా విసురుతోంది. పదిరోజులుగా జిల్లా లో చలితీవ్రత పెరిగి పోతుండటంతో ఏజె న్సీగ్రామాలు చలికి గజగజలాడుతు న్నాయి.

Kumaram Bheem Asifabad:  ఆసిఫాబాద్‌ ఏజెన్సీలో చలి పంజా
ఆసిఫాబాద్‌లో మంట కాగుతున్న ప్రజలు

- రాష్ట్రంలోనే సిర్పూర్‌(యూ)లో 11.0డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

ఆసిఫాబాద్‌, నవంబరు 19 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో చలి పంజా విసురుతోంది. పదిరోజులుగా జిల్లా లో చలితీవ్రత పెరిగి పోతుండటంతో ఏజె న్సీగ్రామాలు చలికి గజగజలాడుతు న్నాయి. గురువారం సిర్పూర్‌(యూ)లో 11.0డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తిర్యాణిలో 11.4డిగ్రీలు, కెరమెరిలో 11.9 డిగ్రీలు, జైనూ రులో 12.0, సిర్పూర్‌(టి)లో 12.8, రెబ్బెన, దహెగాంలలో 13.7, బెజ్జూరు 13.9, ఆసిఫాబాద్‌ 14.3, చింతలమానేపల్లి 14.4, వాంకిడి 14.5డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీ మండలాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు చలినుంచి ఉపశమనం పొందేందుకు చలిమంటలు కాగుతున్నారు.

Updated Date - Nov 19 , 2026 | 11:56 PM