Kumarabhim Asifabad: భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి
ABN , Publish Date - Aug 17 , 2026 | 11:32 PM
నాగుల పంచమిని సోమవారం జిల్లాకేంద్రంలో, మండలాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
ఆసిఫాబాద్‌రూరల్/కాగజ్‌నగర్/ సిర్పూరు(టి)/ చింతలమానేపల్లి/రెబ్బెన/ దహెగాం/కౌటాల/ పెంచికల్‌పేట/తిర్యాణి/ కెరమెరి/బెజ్జూరు/లింగాపూర్/సిర్పూర్(యు), ఆగస్టు 17 (ఆంధ్ర జ్యోతి): నాగుల పంచమిని సోమవారం జిల్లాకేంద్రంలో, మండలాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పట్ట ణంలోని కేస్లాపూర్ నాగసుబ్రమణ్యస్వామి ఆలయంలో ఎమ్మెల్యే కోవలక్ష్మి దంపతులు పుట్టలో పాలు పోసి ప్రత్యేకపూజలు చేశారు. ఆలయఅర్చకుడు ఒజ్జల శిరీష్‌శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లా డుతూ నాగులపంచమి ప్రతిఇంట్లో కాంతులు విరజిమ్ముతూ ప్రతిఒక్కరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు పేర్కొ న్నారు. జిల్లా కేంద్రంలోని కసాబ్‌బాడి, బ్రాహ్మణ్‌వాడ, జన్కా పూర్, టీఆర్‌ఎస్‌నగర్, రాజంపేటలో భక్తులు నాగదేవతకు ప్రత్యేకపూజలు చేసి పుట్టలో పాలు పోశారు. నాగదేవతలకు ప్రత్యేకంగా తయారు చేసిన పిండివంటకాలను నైవేధ్యంగా నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. కాగజ్‌నగర్ పట్టణం లోని హనుమాన్ ఆలయం, రాంమందిర్ ఆలయంతో పాటు వివిధ ఆలయాల్లో పుటలో పాలు పోసేందుకు రద్దీ పెరిగింది. చింతలమానేపలి మండలం కర్జెల్లి గ్రామంలో ముసలమ్మ గుట్ట ఆలయంవద్ద బోనాలను ఘనంగా నిర్వహించారు. రెబ్బెనమండలం ఇందిరానగర్‌లోని శ్రీకనకదుర్గాదేవి మహం కాళీదేవస్థానంలో ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రధాన అర్చ కుడు దేవరవినోద్‌స్వామి తీర్థప్రసాదాలను అందజేశారు. సిర్పూర్(యు) మండలకేంద్రంలో మహదేవ్ ఆలయంలో భక్తులు ఉదయం నుంచే ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. మండలం నుంచి ఆదివాసీలు కేస్లాపూర్ నాగోబా దర్శనం కోసం తరలివెళ్లారు. అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేప ట్టారు. కార్యక్రమాల్లో మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.