ఖర్గే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
ABN , Publish Date - Apr 22 , 2026 | 11:31 PM
ప్రధాని మోదీని టెర్రరిస్టుగా అభివర్ణించిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, సోనియాగాంధీ దేశ ప్రలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ డిమాండ్ చేశారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్
చెన్నూరు, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీని టెర్రరిస్టుగా అభివర్ణించిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, సోనియాగాంధీ దేశ ప్రలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ డిమాండ్ చేశారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద బుధవారం రాస్తారోకో నిర్వహించి మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో గెలిచి ప్రధాని అయిన మోదీ దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నాడన్నారు. ప్రపంచదేశాలు మనదేశం వైపు చూస్తున్నాయంటే అది మోదీ ఘనతేనని తెలిపారు. అలాంటి మోదీని టెర్రరిస్టుగా అభివర్ణించడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ నాయకులకు మోదీని అవమానించడం అలవాటుగా మారిందని, దీన్ని దేశ ప్రజలు క్షమించరన్నారు. ప్రజలే కాంగ్రెస్‌కు తగిన బుద్దిచెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు దుర్గం అశోక్, తుమ్మ శ్రీపాల్, వెంకటేశ్వర్, చారి, వెంకటనర్సయ్య, తిరుపతి, శ్రీనివాస్, రాజశేఖర్‌గౌడ్, శివకృష్న, వెంకటేష్, మానిక్‌రావు, శంకర్, శ్రీనివాస్, శ్రావణి, స్వరూప, రమేష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
నెన్నెల: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నెన్నెల మండలం కుశ్నపల్లిలో బీజేపీ నాయకులు బుధవారం ఖర్గె దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు అంగలి శేఖర్, మండల మాజీ అధ్యక్షుడు శైలెందర్‌సింగ్, నాయకులు లింగంపల్లి మహేష్, రాపల్లి రాజయ్య, పొట్లసిరి సత్యనారాయణ, మండిగ నరేష్, ఊరగొండ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.