పైసల కోసమే కేసీఆర్ కుటుంబం పంచాయితీ
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:29 PM
రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుంభకోణాలతో కూడబెట్టుకున్న పైసల కోసం ఆ కుటుంబంలో ఆ పంచాయితీ మొదలైందని ఆయన కూతురు మాజీ ఎమ్మెల్సీ కవిత ఆరోపణలకు సమాధానం ఎందుకు చెప్పలేక తప్పించుకుంటున్నారని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన, గనులశాఖ మం త్రి డాక్టర్ జి వివేక్‌వెంకటస్వామి ప్రశ్నించారు.
- మంత్రి జి వివేక్ వెంకటస్వామి
మందమర్రిటౌన్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుంభకోణాలతో కూడబెట్టుకున్న పైసల కోసం ఆ కుటుంబంలో ఆ పంచాయితీ మొదలైందని ఆయన కూతురు మాజీ ఎమ్మెల్సీ కవిత ఆరోపణలకు సమాధానం ఎందుకు చెప్పలేక తప్పించుకుంటున్నారని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన, గనులశాఖ మం త్రి డాక్టర్ జి వివేక్‌వెంకటస్వామి ప్రశ్నించారు. పట్టణంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొదటి నుంచి తాను కేసీఆర్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతిపైన ఆరోపణలు చేశానని అవే ప్రస్తుతం నిజమయ్యాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షకోట్ల కుంభకోణం జరిగిందని కేసీఆర్ కుంటుంబంపై వ్యతిరేకంగా మొదటి నుంచి పోరాడిన వ్యక్తిని తానేనని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ గురించి తాము ఏమి చెప్పనక్కర్లేదని మాజీ ఎమ్మెల్సీ కవితే వారి భరతం పడుతోందని అన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగిన తమ పార్టీదే విజయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ప్రజల సౌకర్యార్థం కొత్త బస్సు ఏర్పాటు
మందమర్రి పట్టణ ప్రజల ప్రయాణ సౌకర్యార్థం కొత్త బస్సు ఏర్పాటు చేశామని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన గనులశాఖ మంత్రి డాక్టర్ జి వివేక్‌వెంకటస్వామి తెలిపారు. బుధవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన కొత్త బస్సును కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన బస్సులో కొంతదూరం ప్రయాణించారు. కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, మున్సిపల్ కమిషనర్ రాజలింగు, తహసీల్దార్ సతీష్‌కుమార్, కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రఘునాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యం
మందమర్రిమున్సిపాలిటీ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. బుధవారం పట్టణంలోని దీపక్‌నగర్‌లో కల్వర్టు నిర్మాణ పనులను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో అభివృవృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేశామన్నారు.
క్యాతన్‌పల్లి మున్సిపాలిటి పరిధిలో ఆర్‌ఆర్‌నగర్‌లో 15వ పట్టణ ప్రగతి ఆర్థిక సంఘం 50లక్షల నిధులతో శ్మశానవాటికి, అంతర్గత రహదారి నిర్మాణం, వెయిటింగ్ హాల్, డ్రెస్సింగ్ రూంనకు పనులకు శంకుస్థాపన చేశారు.
క్రికెట్ క్రీడాకారులకు చేయూత
దివంగత కాకా తన తండ్రి వెంకటస్వామి మెమోరియల్ ద్వారా క్రికెట్ క్రీడాకారులకు చేయూతనిస్తామని మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి తెలిపారు. రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో కాకా మెమోరియల్ టీ20లీగ్ క్రికెట్ టోర్నమెంటుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విశాఖ చారిట్రబుల్ ట్రస్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆదరణకు నోచుకోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేస్తున్నా మన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, తవక్కల్ విద్యాసంస్థల చైర్మన్ అబ్దుల్ అజీజ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, తదితరులు పాల్గొన్నారు.