ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే
ABN , Publish Date - Jun 25 , 2026 | 11:07 PM
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు.
- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి
మంచిర్యాల కలెక్టరేట్, జూన 25 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. ఇందిరాగాంధీ 1975 జూన 25న దేశంలో విఽఽధించిన అత్య వసర పరిస్థితులకు 51 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం మంచిర్యాల పట్టణంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్ద మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందన్నారు. రాజకీయపార్టీల నాయకులను, పాత్రికేయులను ప్రజాసంఘాల నాయకుల ను జైలులో పెట్టి ఇందిరాగాంధీ దొడ్డిదారిన రెండు సంవత్సరాలు ప్రధాన మంత్రిగా చలామణి అయ్యారన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను పలుమార్లు రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని అభాసు పాలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు కూల్చివేతల లక్ష్యంగా పెట్టుకుని మంచిర్యాలలో భారీ సెటిల్‌మెంట్‌లు నడపుతున్నారన్నారు. చిరు వ్యాపారులను రోడ్డుపాలు చేసిన ఘనత ఎమ్మెల్యేదేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ఫ్లోర్ లీడర్ గాజుల ముకేష్‌గౌడ్, నాయకులు దుర్గం అశోక్, కార్పోరేటర్‌లు నాగరాజు, సత్యం, శ్రీదేవి, స్వప్నరాణి, నాయకులు రాజ్‌కుమార్, మల్లేష్, అశోక్‌వర్ధన, శ్రీనివాస్, మహిళ నాయకురాల్లు పాల్గొన్నారు.
ఎమర్జెన్సీలో జైలుకువెళ్లిన వారికి సన్మానం
చెన్నూరు: ఇందిరాగాంధీ ప్రభుత్వం 1975లో జూన 25న విధించిన ఎమర్జెన్సీలో జైలుకు వెళ్లిన చెన్నూరుకు చెందిన ఇద్దరు రిటైర్డు ఉపాధ్యాయులు బెల్లంకొండ మల్లారెడ్డి, మార్కాపురి వెంకయ్యలను బీజేపీ నాయకులు పట్టణంలో గురువారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అద్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, నాయకులు లక్ష్మీనారాయణరెడ్డి, చారి, వెంక టేష్, శంకర్, శివకృష్ణ, మధురాజ్, శ్రీనివాస్, లక్ష్మాగౌడ్, దుర్గాప్రసాద్, స్వరూపరాణి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.