Share News

నీటి సమస్య లేకుండా చూడాలి

ABN , Publish Date - Apr 23 , 2026 | 11:18 PM

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో నీటి సమస్యలేకుండా చూడాలని అదనపు కలెక్టర్‌ చంద్రయ్య పేర్కొన్నారు.

నీటి సమస్య లేకుండా చూడాలి
విద్యార్థులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ చంద్రయ్య

అదనపు కలెక్టర్‌ చంద్రయ్య

చెన్నూరు, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో నీటి సమస్యలేకుండా చూడాలని అదనపు కలెక్టర్‌ చంద్రయ్య పేర్కొన్నారు. గురువారం మండలంలోని సుందరసాల గ్రామంలో పర్యటించారు. పీఎంఏజేఏవై పథకంలో గ్రామం ఎంపిక కాగా చేపట్టబోయే పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. పారిశుధ్య పనులను గ్రామాల్లో ముమ్మరంగా నిర్వహించాలన్నారు. తడి, పొడిచెత్త వేర్వేరుగా సేకరించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. అంగనవాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు, తల్లులకు ఇచ్చే పోషకాహారం వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులకు తగు సూచనలు చేశారు. విద్యార్థులతో మాట్లాడి పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. అంతకుముందు చెన్నూరులోని వంద పడకల ఆసుపత్రిని సందర్శించారు. మిగిలి ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్‌ వెంట డీపీవో వెంకటేశ్వర్‌రావు, ఎంపీడీవో మోహన, ఎంపీవో అజ్మత ఆలీ, సర్పంచు మంజుల, కార్యదర్శి వంశీధర్‌, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Apr 23 , 2026 | 11:18 PM