Share News

ప్రశాంతంగా ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

ABN , Publish Date - Feb 25 , 2026 | 11:33 PM

ఇంటర్మీడియట్‌ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 19 కేంద్రాలను ఏర్పాటు చేశా రు.

ప్రశాంతంగా ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం
ఆసిఫాబాద్‌లో పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ హరిత

ఆసిఫాబాద్‌రూరల్‌, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 19 కేంద్రాలను ఏర్పాటు చేశా రు. మొదటి రోజు జనరల్‌ విభాగంలో 4,438 మంది, ఒకేషనల్‌ విభాగంలో 773 మంది మొత్తం 5,211 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా జనరల్‌ విభాగంలో 4,316, ఒకేషనల్‌ విభాగంలో 723 మంది మొత్తం 5,039 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 172 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హా జరయ్యారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగగా పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు అరగంట ముందే చేరుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన సిబ్బంది పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకొకుండా పోలీసులు పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తును నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పీటీజీ బాలుర, గిరిజన బాలికల గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను కలెక్టర్‌ కె హరిత తనిఖీ చేసి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని, ప్రశాం త వాతావరణంలో నిబంధనలకు అనుగుణంగా పరీక్ష లు నిర్వహించాలని అధికారులకు కలెక్టర్‌ సూచించారు.

సిర్పూర్‌(యు): మండల కేంద్రంలో గల ఆదర్శ పాఠశాల, కేజీబీవీతోపాటు లింగాపూర్‌ మండల కేజీబీవీ పాఠశాలల విద్యార్థులకు మండల కేంద్రంలోగల ఆదర్శ పాఠశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. మొదటి రోజు ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం మొత్తం విద్యార్థులు 192 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 15 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు.

దహెగాం: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూని యర్‌ కళాశాలలో మొదటి రోజు 125 మంది విద్యార్థు లకు గాను ఆరుగురు గైర్హాజరైనట్లు సీఎస్‌ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల ఆధ్వర్యంలో బందో బస్తు ఏర్పాటు చేశారు.

బెజ్జూరు: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బుధవారం ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 153 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా ఏడుగురు విద్యార్థులు గైర్హాజరు అయినట్లు పరీక్ష కేంద్రం సీఎస్‌ శారద తెలిపారు.

వాంకిడి: వాంకిడి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బుధవారం ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 203 విద్యార్థులకు గాను ముగ్గురు గైర్హాజరు అయినట్లు సీఎస్‌ చంద్రయ్య తెలిపారు.

కెరమెరి: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్ష లు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 166 మందికి గాను 164 మంది హాజరయ్యారు. పరీక్షా కేంద్రం వద్ద పోలీసులు ఎస్సై మధుకర్‌ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

కౌటాల: మండల కేంద్రంలో ఇంటర్మీడియట్‌ పరీక్ష లు బుధవారం ప్రశాంతంగా ప్రారంభయ్యాయి. జనరల్‌ విభాగంలో 201 మందికి 194 మంది, వొకే షన్‌లో 115 మందికి గాను 105 మంది హాజరు కాగా 17 మంది గైర్హాజరు అయ్యారు.

సిర్పూర్‌(టి): మండల కేంద్రంలో బుధవారం ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమ య్యాయి. మొత్తం 312 మంది విద్యార్థులకు గాను 311 మంది హాజరైనట్లు సీఎస్‌ సురేష్‌ తెలిపారు.

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ పట్టణంలో ఇంటర్మీయేట్‌ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. వివేకనంద, వసుంధర, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సెంటర్లను కేటాయించారు. ప్రతి విద్యార్ధిని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత పరీక్షలు రాసేందుకు అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ వహీదోద్దీన్‌ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Feb 25 , 2026 | 11:33 PM