Share News

అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు

ABN , Publish Date - Apr 29 , 2026 | 11:52 PM

అర్హులైన ప్రతీఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు.

అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు
బావురావుపేటలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభిస్తున్న మంత్రి వివేక్‌వెంకటస్వామి

- మంత్రి వివేక్‌వెంకటస్వామి

చెన్నూరు, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): అర్హులైన ప్రతీఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని బావురావుపేట గ్రామంలో కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హత కలిగి ఇళ్లు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతీఒక్కరికి ఇళ్లు అందుతాయన్నారు. వంద ఇళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, మిగిలిన ఇళ్లు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. రహదారుల విస్తరణలో భాగంగా బావురావుపేట గ్రామం నుంచి కత్తెరసాల వరకు రూ. 5 కోట్లు, బావురావుపేట పేట కాచనపల్లి వరకు రూ. 3 కోట్లతో పనులు చేపట్టడం జరిగిందన్నారు. చెన్నూరు నియోజకవర్గ పరిధిలో రహదారులు, మురుగు కాలువల అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు ప్రజలకు నీటి సమస్య లేకుండా చూస్తామన్నారు. భూనిర్వాసితులకు 26 కోట్ల రూపాయల నష్టపరిమారం మంజూరు చేశామని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గ పరిధిలో నీటి సమస్య తీర్చడానికి 300 బోర్‌వెల్స్‌ ఏర్పాటు చేశామన్నారు. అడ్వాన్స టెక్నాలజీ సెంటర్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ద్వారా నిరుద్యోగ యువతకు శిక్షణఇచ్చి ఉపాధి అవకాశాలు పెంపొందిస్తున్నామని వివరించారు. అంతకుముందు చెన్నూరులోని క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారుకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను, వెనకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించి పనులను వేగవంతంగా చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌లు రాఘవేంద్రరావు, వనజారెడ్డి , అధికారులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2026 | 11:52 PM