హెచ్‌పీవీ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలి
ABN , Publish Date - Mar 09 , 2026 | 11:33 PM
రానున్న రోజుల్లో గర్భాశయ క్యాన్సర్ లాంటి వ్యాధుల నివారణ కోసం 9 నుంచి 14 సంవత్సరాల బాలికలకు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించాలని కలెక్టర్ కె హరిత సూచించారు.
- కలెక్టర్ కె హరిత
ఆసిఫాబాద్‌రూరల్, మార్చి 9(ఆంధ్రజ్యోతి): రానున్న రోజుల్లో గర్భాశయ క్యాన్సర్ లాంటి వ్యాధుల నివారణ కోసం 9 నుంచి 14 సంవత్సరాల బాలికలకు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించాలని కలెక్టర్ కె హరిత సూచించారు. రాష్ట్ర ప్రభురత్వం బాలికలకు ఉచితంగా ఇస్తున్న హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రారంభోత్సవ కార్యక్రమం జిల్లా ఆసుపత్రి ఆవరణలో ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్‌కుమార్, జిల్లా వైద్యాధికారి సీతారాం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. వ్యాక్సిన్‌పై ఎటువంటి అపోహలు అవసరం లేదన్నారు. 9 నుంచి 14 సంవత్సరాల బాలికలు తప్పని సరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని దీంతో గర్భాశయ క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయన్నారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆసుపత్రి మహిళా సిబ్బంది కలెక్టర్‌ను మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించారు.
టి-హబ్ మేనేజర్‌పై ఆగ్రహం..
జిల్లా కేంద్రంలోని టి-హబ్ మేనేజర్ విధులకు గైర్హాజరు అవుతున్నాడని ఆసుపత్రి సూపరింటెండెంట్ కలెక్టర్ దృష్టికి తీసుకు రావడంతో ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో దత్తారావు, డీడబ్ల్యూవో భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
బెజ్జూరు: బెజ్జూరు మండల కేంద్రంలోని సామాజిక ఆసుపత్రిలో సర్పంచ్ సరోజ హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుతున్న ఆహారపు అలవాట్లతో పాటు క్యానర్సర్ వేగంగా విస్తరిస్తుందని, గర్భాశయ క్యాన్సర్ అరికట్టడానికి ప్రభుత్వం ముందసుర్త చర్యలు చేపట్టిందని, 14 ఏళ్ల బాలికలకు వ్యాక్పినేషన్ వేయాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్‌లు శావణ్, శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.