ఆస్పత్రులు ఎంత భద్రం..?
ABN , Publish Date - Oct 03 , 2026 | 12:23 AM
జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల్లో ఏదేని అనుకొని ప్రమాదం సంభవిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పని పరిస్థితులు ఉన్నాయి.
-కనీస సౌకర్యాలు లేనిచోట దవాఖానాల ఏర్పాటు
-నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు
-రోగుల పట్ల కనీస భద్రత చర్యలు శూన్యం
-ప్రమాదం జరిగితే భారీ మూల్యం చెల్లించాల్సిందే..!
మంచిర్యాల, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల్లో ఏదేని అనుకొని ప్రమాదం సంభవిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పని పరిస్థితులు ఉన్నాయి. ఆస్పత్రుల్లో రోగుల కోసం కనీస రక్షణ చర్యలు చేపట్టడం లేదని తెలుస్తోంది. మహా రాష్ట్రలో గతంలో ఓ ఆస్పత్రిలోని ఐసీయూలో జరిగిన అగ్ని ప్రమాదంలో 15 మంది రోగులు సజీవ దహనం కాగా ఆ ఆస్పత్రిలో రోగులు బయటకు వెళ్లే మార్గం లే కనే ప్రాణ నష్టం జరిగిందని అక్కడి అధికారులు వె ల్లడించారు. మరోవైపు ఇటీవల ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో ఏసీ పేలిన ఘటనలో ఇంక్యుబేటర్‌లో చికి త్స పొందుతున్న ఐదుగురు శిశువులు దుర్మరణం పా లయ్యారు. మంచిర్యాలలోనూ అదే మాదిరి ఆస్పత్రుల్లో రోగులకు చికిత్స అందిస్తుండటం గమనార్హం. జిల్లా కేం ద్రంలో రోజు రోజుకూ నూతనంగా ఏర్పాటు చేసే ఆ స్పత్రుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. రోగుల రక్షణా ర్థం కనీస భద్రత చర్యలు చేపట్టడంలో యాజమాన్యా లు నిర్లక్ష్య ధోరణిని అవలంభిస్తున్నాయి. ఫలితంగా అ నుకోని ఉపద్రవం సంభవిస్తే పరిస్థితి పూర్తిగా అదు పు తప్పడమే గాకుండా, భారీగా ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయమై సంబంధిత అధికారులు ధృష్టిసారించి, ముందస్తు రక్షణ చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది.
కనీస సౌకర్యాలు కరువు...
జిల్లా కేంద్రంలో అన్ని విభాగాలకు చెందిన చిన్న పెద్ద ఆస్పత్రులు దాదాపు 150కి పైగా ఉన్నాయి. వాటి లో ఒకటి రెండు మినహా మిగతా వాటిలో కనీస సౌక ర్యాలు కూడా అందుబాటులో లేవు. కనీసం వాహన పార్కింగ్ స్థలం కూడా లేకపోవడం గమనార్హం. ఇరు కు రోడ్లు, సందుల్లోనూ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నా రు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వచ్చి అక్కడ నిలిపి ఉంచే పరిస్థితి లేదంటే అతిశయోక్తికాదు. ధనా ర్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న కొన్ని ఆస్పత్రుల యా జమాన్యాలు రోగులతోపాటు, వారి అటెండెంట్లు వేచి ఉండేందుకు కూడా అవసరమైన ఏర్పాట్లు చేయక పోవడం గమనార్హం. రోగులకు అవసరమైన కనీస సౌ కర్యాలు లేకపోయినా.... కొన్ని ఆస్పత్రుల యాజమా న్యాలు రోగుల నుంచి వసూలు చేసే ఫీజులో ఏ మా త్రం తేడా ఉండదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంది నకాడికి దండుకోవడమే లక్ష్యంగా నూతన ఆస్పత్రులు ఏర్పాటవుతున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు...
ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్న అనేక భవనాల ని ర్మాణం నిబంధనల మేరకు ఉండటం లేదు. కార్లు వెళ్ల లేని గల్లీల్లో వెలిసిన ఆస్పత్రులు పదుల సంఖ్యలో ఉ న్నాయి. అప్పటికే నిర్మాణంలో ఉన్న భవనాలనో, ఇత రత్రా అవసరాల కోసం నిర్మించిన వాటినో ఎంపిక చే సుకొని ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రోగు ల గదులు గాలి, వెలుతురు వచ్చేందుకు కూడా అ వ కాశం లేకుండా ఉంటున్నాయి. అగ్నిమాపకశాఖ ని బంధనల ప్రకారం ఏదైనా అనుకోని అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో ఫైర్ ఇంజిన్ భవనం చు ట్టూ తిరిగి మంటలనార్పేందుకు ఏర్పాట్లు ఉండాలి. అ లాగే బహుళ అంతస్థుల భవనాలకు రెండు వైపులా వ్యతిరేఖ దిశలో విశాలమైన మెట్లు ఏర్పాటు చేయాలి. ప్రమాదాలు సంభవించినప్పుడు ఒకదారి మూసుకు పోతే మరోదారిన రోగులు బయటకు వచ్చే విధంగా మెట్లు ఏర్పాటు చేయాలి. భవనాల్లో సైతం ఒక వరం డాలో ప్రమాదం జరిగితే మరో వరండా నుంచి బయ టకు వెళ్లే ఏర్పాట్లు ఉండాలి. అలాగే ఇంకో వైపు ఇను ముతో వెడల్పైన రాంపులు ఏర్పాటు చేయాలి. జిల్లా కేంధ్రంలో ప్రస్తుతం ఏ ఆస్పత్రిలో చూసిన ఒకవైపు మెట్లే దర్శనమిస్తుండగా, రాంపులు సైతం ఉండటం లేదు.
భద్రతా చర్యలు శూన్యం...
అగ్నిమాపకశాఖ నిబంధనల ప్రకారం జీ +4 భవ నం ఎత్తు కనీసం 15 మీటర్లు ఉంటే తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ నో ఆబ్జక్షన్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంది. అ యితే అనేక భవనాల నిర్మాణాలు నిబంధనల మేరకు చేపట్టకపోవడంతో ఫైర్ డిపార్టుమెంటు నుంచి నో ఆ బ్జక్షన్ పొందే అవకాశం కూడా లేదు. అగ్ని ప్రమాదా లు సంభవించిన సమయంలో కేవలం ఆస్పత్రుల లోని పేషెంట్లేగాక, ఆయా గదుల్లోని అత్యంత విలువైన పరి కరాలు అగ్నికి ఆహుతయ్యే ప్రమాదం కూడా ఉంటుం ది. ఈ క్రమంలో ఆయా గదుల్లో చికిత్స పొందుతున్న రోగుల ప్రాణాలు గాలిలో కలిసే అవకాశం ఉంది. అటు ఆస్పత్రుల యాజమాన్యాలకు తీవ్ర నష్టం వాటి ల్లే ప్రమాదం ఉంది. అనుకోని విధంగా మంటలు చె లరేగిన సమయంలో వాటిని ఆర్పేందుకు కార్బన్ డ యాక్సైడ్, హైడ్రేంట్ సిస్టమ్, డ్రై కెమికల్ పౌడర్‌తో కూడిన ఫైర్ ఎస్టింగిషర్లు అందుబాటులో ఉంచుకోవ లసి ఉంది. పరికరాలను అందుబాటులో ఉంచుకోవ డంతోపాటు సిబ్బందికి వాటిని ఉపయోగించడంలో అవగాన కల్పించాలి. అప్పుడే హఠాత్తుగా సంభవించే అగ్ని ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉం టుంది. ఈ దిశగా ఏర్పాట్లు చేస్తే రోగులతోపాటు ఆస్ప త్రుల నిర్వాహకులకూ నష్టం వాటిల్లకుండా ఉంటుంది. చాలా వరకు సంభవించే అగ్ని ప్రమాదాలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమవుతోంది. ఏసీలు నిరంతరం గా ఒకే విధంగా నడిపితే వేడిపుట్టి మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. ఒకే సమయంలో అన్ని ఏసీలు ఆన్ చేయకుండా మార్చి ఉపయోగించడం ద్వారా ప్రమా దాలను నివారించవచ్చును. అలాగే విద్యుత్ వైరింగ్ ప ట్ల కూడా అప్రమత్తత అవసరం. వినియోగించే వి ద్యుత్‌కు సరిపడా వైరింగ్ స్థాయి ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే కనీస ఫైర్ ఫైటింగ్ పరికాలు ఏ ర్పాటు చేసుకోవాలి. అవి పనిచేస్తున్నాయో లేదో తరు చుగా పరిశీలించడం ద్వారా అగ్ని ప్రమాదాల నివార ణకు చర్యలు చేపట్టాలి. అనుకోని ప్రమాదం సంభవిం చకముందే అగ్నిమాపకశాఖ అధికారులు మేల్కొని ఆస్పత్రులను తరుచుగా పర్యవేక్షిస్తూ నిబంధనలు త ప్పనిసరిగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకో వలసిన అవసరం ఎంతైనా ఉంది.