Share News

పోడు సమస్యను పట్టించుకోని ప్రభుత్వం

ABN , Publish Date - Jun 15 , 2026 | 11:36 PM

: ప్రతీ సంవ త్సరం ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో జిల్లాలో పోడు పోరు జర గడం దారుణమని దానికి చరమగీతం పాడేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వంపై ఉందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

పోడు సమస్యను పట్టించుకోని ప్రభుత్వం
సమావేశంలో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు కవిత

- టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు కవిత

ఆసిఫాబాద్‌రూరల్‌, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): ప్రతీ సంవ త్సరం ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో జిల్లాలో పోడు పోరు జర గడం దారుణమని దానికి చరమగీతం పాడేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వంపై ఉందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆసిఫా బాద్‌ జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా జిల్లా కేం ద్రానికి చేరుకుని జిల్లా ఇన్‌చార్జి వినోద్‌ ఆధ్వర్యంలో పార్టీ కా ర్యాలయాన్ని సోమవారం ప్రారంభించారు. అనంతరం విలేక రుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు ఇబ్బందులకు గురిచేసే విధంగా తీసుకువచ్చిన యూరియా యాప్‌ను గంగలో పడే యాలన్నారు. యూరియా బుకింగ్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త యాప్‌ ప్రభుత్వానికి కూడా అర్థం కావ డం లేదని ఎద్దేవా చేశారు. వెంటనే రద్దు చేయాలని డిమాం డ్‌ చేశారు. ప్రతీసంవత్సరం ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో జిల్లాలో పోడుపోరు జరగడం దారుణమని దాన్ని చరమగీ తం పాడేలా చూడాల్సిన రాష్ట్రప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పోడుపోరుకు స్వస్తి పలకాలంటే భూములకు జియో మార్కింగ్‌, జియో ట్యాగింగ్‌ చేయాలని సూచించారు. అటవీ హక్కుల చట్టం కనీసం కనిపించడం లేదని గిరిజన కార్పొరేషన్‌ ఉనికి కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని ప్రభుత్వం కల్పించాలన్నారరు. జిల్లాలో 1/70 చట్టం అమల్లో ఉందని దీని ప్రకారం జిల్లాలో నివనిస్తున్న గిరిజనేతరుల హక్కులను కూడా ప్రభుత్వం కాపాడాలన్నారు. దీనిపై అనేక మంది తమకు ఫిర్యాదు చేశారని కలెక్టర్‌కు చట్టంపై అవగాహన లేక పోవడం దారుణం అన్నారు.

కుమరం భీం జల్‌ జంగల్‌ జమీన్‌ పేరుతో చేసిన పోరాటానికి పురిటి గడ్డ ఆసిఫాబాద్‌ అని తన మొదటి ప్రయాణం కార్యాలయ ప్రారంభం ఇక్కడి నుంచే ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. తన పర్యటన సందర్భంగా పోలీసు లు కార్యకర్తలను ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేసినట్లు తన దృష్టికి వచ్చిందని, అడ్డుపడినా ఆగేది లేదని, మళ్లీ ఇలాంటి ఇబ్బందులు పెడితే పోలీసుల అంతు చూస్తామంటూ హెచ్చరించారు. అంతకు ముందు కవితను పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలకగా కుమరం భీం విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి ర్యాలీగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బోడ జనార్దన్‌, కావేటి సబితి, హెచ్‌ఎంఎస్‌ నాయకులు రియాజ్‌, నాయకులు అశోక్‌, ప్రసాద్‌, తిరుపతి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 15 , 2026 | 11:36 PM