అడవి సంరక్షణలో అటవీశాఖ అధికారులు కీలకం
ABN , Publish Date - Sep 11 , 2026 | 11:48 PM
అడవులను రక్షించి పర్యావరణాన్ని కాపాడడంలో అటవీశాఖ అధికారులు కీలకపాత్ర పోషిస్తున్నారని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్
మందమర్రిటౌన, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): అడవులను రక్షించి పర్యావరణాన్ని కాపాడడంలో అటవీశాఖ అధికారులు కీలకపాత్ర పోషిస్తున్నారని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని గాంఽధారీ అటవిశాఖ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన ముందుగా కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు శాంతారాం, జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషనజాదవ్‌లతో కలిసి అమరవీరుల చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అటవీ అభివృద్ధికి అటవీ అమరవీరులు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆదివాసీ గిరిజనుల హక్కులను కాపాడుతూనే అటవీ అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతీఒక్కరు మొక్కలు నాటి పరిరక్షించాలని సూచించారు. ఈ సందర్భంగా ఇండియన రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. జిల్లాలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదానం కోసం ముందుకు వచ్చిన అటవీశాఖ అధికారుల సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ సిబ్బంది తదితరులు పాల్గొనగా రక్తదానం చేసిన వారికి ధ్రువపత్రాలు అందజేశారు.
జన్నారం: కవ్వాల్ అటవీ డివిజన కార్యాలయంలో జాతీయ అటవీ అమరుల సంస్మరణ దినోత్సవా న్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎఫ్‌డీవో రామ్మోహన మాట్లాడుతూ విధినిర్వహణలో బాధ్యతగా పనిచేసే ప్రాణాలు కోల్పోయిన వారిని మరువలేమని అన్నారు. ప్రతి అమరుడికి నివాళులు ఆర్పించడం బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు.
మంచిర్యాలక్రైం: అటవీశాఖ అధికారులకు, సిబ్బందికి ఆయుధాలు మంజూరు చేయాలని టీఎనజీవో అటవీశాఖ సెంట్రల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పొన్న మల్లయ్య డిమాండ్ చేశారు. మంచిర్యాలలో అటవీశాఖ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ శాఖ అధికారులు తమ ప్రాణాలతో పాటు విలువైన అటవీ సంపదలను రక్షించుకునేందుకు ఆయుధాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.