పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:01 AM
పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూచించారు.
- కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూచించారు. బుధవారం పట్టణంలోని బజార్ ఏరియాలోని జిల్లాపరిషత ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అధికారులు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలన్నారు. తాగునీరు, నిరంతర విద్యుత సరఫరాతో పాటు వెలుతురు సరిగ్గా ఉండేలా చూడాలన్నారు. అత్యవసరం నిమిత్తం అవసరమైన మందులతో వైద్య సిబ్బందిని పరీక్ష కేంద్రాల వద్ద నియమించామని తెలిపారు. పరీక్షలు నడుస్తున్న సమయంలో జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలన్నారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి భోజనాన్ని పరిశీలించారు. ఇటీవల నిర్మించిన అదనపు తరగతి గదులను పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడారు. క్రమశిక్షణతో చదువుకుని పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలన్నారు. అలాగే రాంనగర్‌లో నిర్మిస్తున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించి పనులను వేగవంతం చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ సంపతరెడ్డి, అధికారులు, ఉపాధ్యాయులు ఉన్నారు.