Share News

రోడ్డు భద్రత నియమాలు ప్రతిఒక్కరూ పాటించాలి

ABN , Publish Date - Jan 16 , 2026 | 11:40 PM

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు అరైవ్‌ అలైవ్‌ రోడ్డు భద్రత కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నితికా పంత్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

రోడ్డు భద్రత నియమాలు ప్రతిఒక్కరూ పాటించాలి
సిర్పూర్‌(టి) మండల కేంద్రంలో అవగాహన కల్పిస్తున్న ఎస్సై సురేష్‌, సిబ్బంది

- 27వ తేదీ వరకు అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమ నిర్వహణ

- ఎస్పీ నితికా పంత్‌

ఆసిఫాబాద్‌, జనవరి 16(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు అరైవ్‌ అలైవ్‌ రోడ్డు భద్రత కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నితికా పంత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నుంచి ఈ నెల 27 వరకు అరైవ్‌ అలైవ్‌ రోడ్డు భద్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలో ప్రతీ పోలీసు స్టేషన్‌ పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది ఆధ్వ ర్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. రోడ్డు ప్రమాదాల వల్ల అమూల్యమైన ప్రాణాలు కోల్పోతున్న దృష్ట్యా ప్రతీ వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలను విధిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్టు ధరించాలన్నారు. అతివేగం గా, మద్యం సేవించి, మొబైల్‌ ఉపయోగించి వాహనా లు నడపవద్దని పేర్కొన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతా యని వివరించారు. అరైవ్‌ అలైవ్‌ రోడ్డు భద్రతా కార్యక్ర మం శుక్రవారం నుంచి 27వ తేదీ వరకు కొనసాగు తుందన్నారు. అవగాహన కార్యక్రమాలు, తనిఖీలు, ప్రజల్లో రోడ్డుభద్రతపై చైతన్యం కల్పిస్తామని తెలిపారు.

రోడ్డు భద్రతపై అవగాహన

సిర్పూర్‌(టి): మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో రోడ్డు భద్రతలో భాగంగా శుక్రవారం సీఐ సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఎస్సై సురేష్‌ అరైవ్‌ అలైవ్‌ ప్రోగ్రామ్‌.. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ప్రతీఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రహీముద్దీన్‌, ఏఎస్సైలు చంద్రశేఖర్‌, రాములు తదితరులు పాల్గొన్నారు.

పెంచికలపేట: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తహసీల్దార్‌ కార్యాలయంలో ఎస్సై అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో అరైవ్‌, అలైవ్‌ రోడ్డు ప్రమా దాల నివారణపై అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత పై అవగాహన కల్పించేందుకు కార్యక్రమం చేపడుతు న్నామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కార్యాల యం, ఆసుపత్రి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 16 , 2026 | 11:40 PM