Share News

ప్రతీ ఒక్కరు ఆరోగ్య చిట్కాలు పాటించాలి

ABN , Publish Date - Apr 06 , 2026 | 11:02 PM

ప్రతి ఒక్కరూ ఆరోగ్య వంతంగా ఉండాలంటే ఆరోగ్య చిట్కాలు పాటించాలని కలెక్టర్‌ హరిత అన్నారు.

ప్రతీ ఒక్కరు ఆరోగ్య చిట్కాలు పాటించాలి
2కే రన్‌లో పాల్గొన్న కలెక్టర్‌ కె హరిత, అధికారులు

- కలెక్టర్‌ కె.హరిత

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ ఆరోగ్య వంతంగా ఉండాలంటే ఆరోగ్య చిట్కాలు పాటించాలని కలెక్టర్‌ హరిత అన్నారు. సోమవారం సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయ ఆవరణలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వైద్య కళాశాల, నర్సింగ్‌ కళాశాల విద్యార్థులు చేపట్టిన 2కే రన్‌ ర్యాలీని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సీతారాం, ప్రిన్సిపాల్‌ సుబోద్‌కుమార్‌లతో కలిసి కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆరోగ్య వంతంగా ఉండాలంటే ఆరోగ్య సూత్రాలు పాటించాలన్నారు. సమతుల ఆహారం తీసుకోవాలన్నారు. ప్రతీ రోజు, నడక, వ్యాయామం చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరు ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని తెలిపారు. ఆరోగ్య చిట్కాలు పాటిస్తే వ్యాధులకు దూరంగా ఉండవచ్చన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన- ప్రగతిప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6 నుంచి 11 వరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య వారం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ర్యాలీ కుమరం భీం చౌరస్తా మీదుగా బస్టాండ్‌, అంబేద్కర్‌ చౌక్‌ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో అధికారులు, వైద్యాధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2026 | 11:02 PM