గంజాయి అక్రమ రవాణా నివారణకు కృషిచేయాలి
ABN , Publish Date - May 23 , 2026 | 11:29 PM
జిల్లాలో అక్రమంగా గంజాయి సాగు చేసిన వినియోగించినా సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె హరిత సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సంబంధిత శాఖ ల అధికారులతో నిర్వహించిన సమావేశానికి అదనపు ఎస్పీ చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
- కలెక్టర్ కె హరిత
ఆసిఫాబాద్, మే 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అక్రమంగా గంజాయి సాగు చేసిన వినియోగించినా సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె హరిత సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సంబంధిత శాఖ ల అధికారులతో నిర్వహించిన సమావేశానికి అదనపు ఎస్పీ చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో గంజాయి సాగు చేసిన అక్రమంగా రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవా లని కలెక్టర్ హరిత సూచించారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను రవాణా శాఖాధికారులు తనిఖీలు నిర్వహించాలన్నారు. కల్లు కంపౌండ్‌లో విక్రయించే తెల్లకల్లు షాం పిల్స్‌ను తీసుకోవాలన్నారు. కల్లు కాంపౌండ్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాఠశాలల పరిసరాల్లో వంద మీటర్ల పరిధిలో ఉన్న పాన్ టేలాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అడవుల్లో గంజాయి సాగు చేయ కుండా అటవీ శాఖాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మెడిల్ షాప్‌లను తనిఖీలు నిర్వహించి అధిక మోతాదు మత్తు మందుల కొనుగోలు చేసే వారి వివరాలు సేకరించాలన్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్‌లలో అనుమానస్పదంగా సంచరించే వారి వివరాలు సేకరించాలన్నారు. గంజాయి సేకరించడం వల్ల ఆరోగ్యం చెడిపో యి ఆర్థికంగా కుటుంబాలు చితికి పోతున్నాయన్నారు. గంజాయి నివారణకు గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఉద్యోగ మేళాలను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగ మేళాలను సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలు మెరుగు పర్చుకో వాలని కలెక్టర్ కె హరిత సూచించారు. శనివారం సమీకృత కలెక్టరే ట్ సమావేశ మందిరంలో ప్రజాపాలన- ప్రగతిప్ర ణాళిక కార్యక్రమంలో భాగంగా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో యువజన వారోత్సవాల కార్యక్ర మానికి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగ మేళాలను సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలను మెరుగు పర్చుకో వాలని చెప్పారు. పలు కార్పొరేట్ కంపెనీలు ఆకర్షణీయమైన జీతాలు అందిస్తున్నాయని అన్నా రు. మే 5న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జాబ్ మేళాలలో ఆసిఫాబాద్ జిల్లా నుంచి 11 మంది నిరుద్యోగులు ఎంపిక అయ్యారని అన్నారు. యువజన వారోత్సవాల్లో భాగంగా మే 18 నుంచి మే 23 వరకు రోజుకో కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈనెల 21న క్రీడా దినోత్సవం రోజున క్రీడాకారులకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగిందని, ఈ సందర్భంగా ఉద్యోగ మేళాలో ఉద్యోగాలు సాధించిన 11 మందికి నియామక పత్రాలు, క్రీడా పోటీల్లో పాల్గొన్న వారికి షీల్డ్‌లతో పాటు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో క్రీడల శాఖ అధికారి అశ్వక్ అహ్మద్, జిల్లా ఇండస్ట్రీయల్ మేనేజర్ అశోక్, తదితరులు పాల్గొన్నారు.