Share News

వన్యప్రాణుల సంతతి పెంచేందుకు కృషిచేయాలి

ABN , Publish Date - Mar 08 , 2026 | 11:38 PM

జిల్లాలోని ప్రతి రేంజ్‌లో వన్యప్రా ణుల సంతతి పెరిగేలా అటవీ శాఖాధికారులు కృషిచేయాలని పీసీసీఎఫ్‌ వైల్డ్‌ వార్డెన్‌ వినయ్‌కుమార్‌ అన్నారు.

వన్యప్రాణుల సంతతి పెంచేందుకు కృషిచేయాలి
ఇటిక్యాల పహాడ్‌ అటవీ ప్రాంతాన్ని సందర్శిస్తున్న అధికారులు

- పీసీసీఎఫ్‌ వైల్డ్‌ వార్డెన్‌ వినయ్‌కుమార్‌

సిర్పూర్‌(టి), మార్చి 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రతి రేంజ్‌లో వన్యప్రా ణుల సంతతి పెరిగేలా అటవీ శాఖాధికారులు కృషిచేయాలని పీసీసీఎఫ్‌ వైల్డ్‌ వార్డెన్‌ వినయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం రేంజ్‌ పరిధిలోని ఇటిక్యా లపహాడ్‌ అటవీ ప్రాంతంలోని బేక్‌ క్యాంపులో చెక్‌ డ్యాంలు, నీటి కుంటలు, చెట్లను పరిశీలించారు. ప్రత్యేకంగా మహారాష్ట్రలోని తడోబా నుంచి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న వన్యప్రాణులు, పులల పాదమద్రుఉలను గుర్తిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో వన్యప్రా ణుల సంరక్షణకు కల్పించే వసతులపై సిబ్బందికి వివరించారు. రానున్న భవిష్యత్‌ కార్యచరణపై అటవీ శాఖ సిబ్బందికి సూచించారు. అభయారణ్యా న్ని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, ఎలాంటి ప్లాస్టిక్‌ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయనవెంట కవ్వాల్‌ ఎఫ్‌డీబీటీ శాంతారాం, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్‌, డీఎఫ్‌వో సుశాంత్‌ సింగ్‌, ట్రైనీ ఐఎఫ్‌ఎస్‌ భార్గవ్‌కుమార్‌, ఎఫ్‌డీవో అప్పయ్య, ఎఫ్‌ఆర్వోలు అనిల్‌కుమార్‌, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2026 | 11:38 PM