ఘనంగా ఈస్టర్ వేడుకలు
ABN , Publish Date - Apr 05 , 2026 | 11:57 PM
దండేపల్లి మండలంలోని పలు గ్రామాలో ఆదివారం ఈస్టర్ డే వేడుకలను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.
దండేపల్లి ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): దండేపల్లి మండలంలోని పలు గ్రామాలో ఆదివారం ఈస్టర్ డే వేడుకలను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని ఆయా గ్రామాలోని చర్చిల్లో ప్రత్యేక పార్ద్థనలు చేశారు. తెల్లవారుజామున చర్చిల్లో కొవ్వొత్తులు వెలిగించి, యేసుక్రీస్తును స్తుతిస్తూ పాటలు ఆలపిం చారు. ఆయా చర్చీల పాస్టర్లు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
భీమారం: భీమారంలోని చర్చిలో పాస్టర్ సత్యరాజ్ ఆధ్వర్యంలో ఈస్టర్ డే వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో అయిత నరేష్, శ్రీనివాస్, అమర్‌సింగ్, రాములు నాయక్, దేవేందర్, దయాకర్, జాన్సన, రాజునాయక్, పుష్ప, నరేష్ పాల్గొన్నారు.