సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల డ్రామా
ABN , Publish Date - Jan 21 , 2026 | 11:26 PM
సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు డ్రామా ఆడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాఽథ్ వెరబెల్లి పేర్కొన్నారు.
- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాఽథ్ వెరబెలి
మంచిర్యాల కలెక్టరేట్, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు డ్రామా ఆడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాఽథ్ వెరబెల్లి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు చేసిన అవినీతిని బయట పెడతానని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికీ ఒక్క బీఆర్‌ఎస్ పార్టీ అవినీతిని వెలికితీయలేదన్నారు. రెండు పార్టీల వెనుక చీకటి ఒప్పందం ఉందని విమర్శించారు. సింగరేణి బొగ్గు బ్లాకుల కుంభకోణంపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను ఒక ఏటీఎంగా మార్చిందన్నారు. సమావేశంలో నా యకులు పెద్దపల్లి పురుషోత్తం, గాజుల ముకేష్‌గౌడ్, వెంకటేశ్వర్‌రావు, కృష్నమూర్తి, ఆంజనేయులు, వెంకటకృష్ణ, మల్లికార్జున్, రాజ్‌కుమార్, శ్రీశైలం, మధుసూదన్‌రావు, రాకేష్‌రెన్వా తదితరులు పాల్గొన్నారు.