Share News

దంత ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు

ABN , Publish Date - Jan 16 , 2026 | 11:42 PM

ప్రజలు దంత ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు సూచించారు.

దంత ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు
కాగజ్‌నగర్‌ పట్టణంలోని కాపువాడలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు

- ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు

బెజ్జూరు, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ప్రజలు దంత ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు సూచించారు. బెజ్జూరు మండ ల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ డెంటల్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వ హించిన దంత వైద్య శిబిరాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ మారుమూల ప్రాంతాల్లో దంత వైద్యసేవలు అందించడానికి టీడీఎస్‌ఏ ముందుకురావడం అభినంద నీయమన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్ట డం హర్షనీయమన్నారు. ప్రజలు ఆరోగ్యం విషయంలో పలు జాగ్రత్తలు పాటించాలని నిర్లక్ష్యం చేయవద్దని, తంబాకు, గుట్కాలు వంటి వాటికి దూరంగా ఉండాల ని సూచించారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ మణిదీప్‌ బాలుసాని, డాక్టర్‌ శ్రావణ్‌, డాక్టర్‌ శ్రీనివాస్‌, కీరిత, రసజ్ఞ, హర్షిని, సఫియా, సర్పంచ్‌లు సరోజ, రామకృష్ణ, ఉప సర్పంచ్‌ రాకేష్‌, నాయకులు తిరుపతి, మనోహర్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

కాపువాడలో రూ.1.80 కోట్లతో డ్రైన్‌ నిర్మాణం

కాగజ్‌నగర్‌: పట్టణంలోని కాపువాడలో రూ.1.80 కోట్లతో డ్రైన్‌ నిర్మాణానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు తెలిపారు. శుక్రవారం కాపువాడలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో ఎమ్మెల్యే మాట్లాడారు. కాపువాడలో మేజర్‌ డ్రైన్‌ ఏర్పాటు కోసం రూ.1.80 కోట్లతో టెండరు ప్రక్రియ నడుస్తోందన్నారు. త్వరలోనే పనులు ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. అనంతరం రైల్వే అండర్‌ సైట్‌ను పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ పట్టణ అధ్యక్షు డు ఆర్మీ శివకుమార్‌, ప్రధాన కార్యదర్శి తిరుపతి, ఎస్సీ మోర్చా అధ్యక్షులడు చిప్పకుర్తి శ్రీనివాస్‌, మాజీ కౌన్సిల ర్లు సిందం శ్రీనివాస్‌, దెబ్బటి శ్రీనివాస్‌, మాజీ ఎంపీపీ కోండ్ర మనోహర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 16 , 2026 | 11:42 PM