Share News

‘ప్రజాపాలన’ వినతులను డాక్యుమెంట్‌ చేయండి

ABN , Publish Date - Jun 25 , 2026 | 11:09 PM

ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో శాఖల వారీ గా కేటాయించిన లక్ష్యాలు, సాధించిన ఫలితా లు, ప్రజల వినతులు, సమస్యల పరిష్కారం, పెండింగ్‌ అంశాలపై డాక్యుమెంట్‌ రూపొందిం చాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృ ద్ధి శాఖ కమిషనర్‌ దివ్యదేవరాజన జిల్లా అధికా రులకు సూచించారు.

‘ప్రజాపాలన’ వినతులను డాక్యుమెంట్‌ చేయండి
సమావేశంలో మాట్లాడుతున్న దివ్యదేవరాజన, పక్కన కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

- పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ దివ్యదేవరాజన

మంచిర్యాల కలెక్టరేట్‌, జూన 25 (ఆంధ్రజ్యో తి): ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో శాఖల వారీ గా కేటాయించిన లక్ష్యాలు, సాధించిన ఫలితా లు, ప్రజల వినతులు, సమస్యల పరిష్కారం, పెండింగ్‌ అంశాలపై డాక్యుమెంట్‌ రూపొందిం చాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృ ద్ధి శాఖ కమిషనర్‌ దివ్యదేవరాజన జిల్లా అధికా రులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌ కా ర్యాలయంలో కలెక్టర్‌, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో సాలిడ్‌ లిక్విడ్‌ వేస్ట్‌మేనేజ్‌మెంట్‌ నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించామని, ప్రతీ గ్రా మంలో నాలుగు రకాల చెత్త నిర్వహణ చేపట్టా లని తెలిపారు. ఇంటింటికి ఇంకుడుగుంతలు నిర్మించాలన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు 30 రకాల వైద్య పరీక్షలను నిర్వహి స్తామన్నారు. రైతులకు పంట మార్పిడి విధానం పై అవగాహన కల్పించా లన్నారు. విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, విద్యార్థు లకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శు లు గ్రామాల అభివృద్ధికి సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. కుక్కులు, కోతుల బెడ ద లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్లాస్టిక్‌ నివారణకు కృషి చేయాలని సూచించారు.

అనంతరం కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడు తూ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామ న్నారు. విద్యారంగం బలోపేతానికి కృషిచేస్తున్నా మని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగా హన కల్పిస్తున్నామని తెలిపారు. బాలికల విద్య పై ప్రత్యేక దృష్టిసారిస్తున్నామని పేర్కొన్నారు. మహిళలు, రైతులు సంక్షేమానికి కృషి చేస్తున్నా మని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ విలాయత ఆలీ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2026 | 11:09 PM