Share News

అందరి సమన్వయంతో కార్పొరేషన్‌ అభివృద్ధి

ABN , Publish Date - Mar 04 , 2026 | 11:30 PM

మున్సిపల్‌కార్పొరేషన్‌ పరిధిలోని అధికారులు, ప్రజల సమన్వయంతో మంచిర్యాల కార్పొరేషన్‌ అభివృద్ధి సాధ్యమని మంచిర్యాల మేయర్‌ ధర్ని మధూకర్‌ అన్నారు.

అందరి సమన్వయంతో కార్పొరేషన్‌ అభివృద్ధి
గోడప్రతులను విడుదల చేస్తున్న మేయర్‌ ధర్ని మధూకర్‌, కమిషనర్‌ అన్వేశ్‌

- మంచిర్యాల మేయర్‌ ధర్ని మధూకర్‌

మంచిర్యాల క్రైం, మార్చి4 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌కార్పొరేషన్‌ పరిధిలోని అధికారులు, ప్రజల సమన్వయంతో మంచిర్యాల కార్పొరేషన్‌ అభివృద్ధి సాధ్యమని మంచిర్యాల మేయర్‌ ధర్ని మధూకర్‌ అన్నారు. బుధవారం మంచి ర్యాల కార్పొరేషన్‌ కార్యాలయంలో మున్సిపల్‌ కమిషనర్‌తో కలిసి ‘మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత’ అనే కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. శానిటేషన్‌ పట్టణ ప్రణాళికలో భాగంగా 60 నుంచి 70 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నామ న్నారు. రెండురోజుల పాటు మూడు డివిజన్ల చొప్పున వార్డుల్లో మున్సిపల్‌ అధికారులతో పాటు శానిటేషన్‌ సిబ్బంది డివిజన్‌ కార్పొరే టర్లతో వార్డుల సమస్యలు ముఖ్యంగా పారి శుధ్యం, మంచినీటి సమస్య రోడ్లు, గుంతలు, లైటింగ్‌ ఇతర సమస్యలను గుర్తించడం వాటి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరు గుతుందన్నారు. ప్రజలు నేరుగా గాని, పత్రికముఖంగా కాని సమస్యలు తెలియ జేయాలని సమస్యలపై వెంటనే స్పందిస్తామ న్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడప డేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మంచి ర్యాల కార్పొరేషన్‌ను ఆదర్శంగా నిలిపేం దుకు ఎమ్మెల్యే సహకారంతో నంబరు వన్‌ కార్పొ రేషన్‌గా తీర్చిదిద్దుతామన్నారు. కొత్త లైట్లు, కొత్త రోడ్లు వంటి వాటిని పరిశీలిస్తామన్నారు. ప్రజలు, అదికారులు సిబ్బంది సమన్వ యంతో ప్రత్యేక విధి విధానాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ సల్ల రమ్య, మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేష్‌, కార్పొరేటర్లు తూముల నరేశ్‌, చింతపండు శ్రీనివాస్‌, సురమల్ల హరి క్రిష్ణ, సల్ల శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2026 | 11:30 PM