‘ఆదర్శ గ్రామ యోజన’తో అభివృద్ధికి చర్యలు
ABN , Publish Date - Apr 15 , 2026 | 11:19 PM
ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ద్వారా గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి, వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ద్వారా గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి, వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టర్ సమావేశ మందిరంలో అధికారులతో కలిసి ఎంపిక చేయబడిన ఏడు గ్రామాల సర్పంచులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడు తూ పీఎంఏజీవై పథకంలో ఏడు గ్రామాలు ఎంపికయ్యాయన్నారు. చెన్నూరు మండలంలోని సుందరశాల, దండేపల్లి మండలంలోని ధర్మారావుపేట, హాజీపూర్ మండలంలోని హాజీపూర్, జైపూర్ మండలంలోని కిష్టాపూర్ పరిధిలోని రొమ్మిపూర్, కన్నెపల్లి మండలంలోని సాలిగాం, తాండూర్ మండలంలోని చౌటుపల్లి, వేమనపల్లి మండలంలోని బుయ్యారం గ్రామాలను ఎంపిక చేశామన్నారు. యఈ గ్రామాల్లో అన్నివర్గాల ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సేవలు అందుబాటులో ఉండి జీవన ప్రమాణాలు మెరుగు పడేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. పథకం అమలులో భాగంగా గ్రామస్థాయి సమన్వయ కమిటీలు, జిల్లాస్థాయి ప్రాజెక్టు అప్లైజల్ కమిటీలు, రాష్ట్రస్థాయి కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. సర్పంచు అధ్యక్షతన గ్రామస్థాయి కమిటీ, కలెక్టర్ అద్యక్షతన జిల్లాస్థాయి కమిటీ పనిచేస్తూ పథకం అమలు, పర్యవేక్ష ణ, సమన్వయం వంటి బాద్యతలను నిర్వహిస్తుందని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీపీవో వెంకటేశ్వర్‌రావు, జడ్పీ సీఈవో గణపతి, జిల్లా సంక్షేమాధికారి రౌఫ్‌ఖాన్, డీఎంహెచ్‌వో అనిత, అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు.