లాడ్జీల్లో బస చేసేవారి వివరాలు నమోదు చేయాలి
ABN , Publish Date - Jun 07 , 2026 | 11:31 PM
లాడ్జీల్లో బసచేసే వారి పూర్తి వివరాలను నమోదు చేయాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు.
- మంచిర్యాల డీసీపీ భాస్కర్
మంచిర్యాలక్రైం, జూన 7(ఆంధ్రజ్యోతి): లాడ్జీల్లో బసచేసే వారి పూర్తి వివరాలను నమోదు చేయాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. మంచిర్యాల పట్టణంలో శనివారం రాత్రి నాకాబంది నిర్వహించి పలు వాహనాలను తనిఖీ చేశారు. అనంతరం లాడ్జీల్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాడ్జీలో బస చేసేవారి వివరాలను నమోదు చేయాలన్నారు. గదుల్లో బసచేస్తున్న వారి వివరాలను ధ్రువీకరించుకోవాలని సూచించారు. లాడ్జీల యాజమాన్యాలు నిర్వాహకులకు పలు సూచనలు జారీ చేశారు. ప్రతివ్యక్తి ఆధార్‌కార్డు, ఫోన నంబర్ తదితర వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఫోన నంబర్ సరైందో కాదోనని నిర్ధారించుకోవాలని ఆదేశించారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారి వివరాలను అనుమానితుల పట్ల సీఐకి సమాచారం అందించాలన్నారు. ప్రజల భద్రత నేరాల నియంత్రణ అనుమానాస్పద వ్యక్తుల గుర్తింపే లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ ప్రమోద్‌రావు, ఎస్‌ఐ మధుసూదన, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.