Share News

ప్రజాస్వామ్యం గెలిచింది

ABN , Publish Date - Apr 04 , 2026 | 11:44 PM

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గెలిచిందనడానికి క్యాతనపల్లి మున్సిపల్‌ ఎన్నికలే నిదర్శనమని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన అన్నారు.

ప్రజాస్వామ్యం గెలిచింది
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెలే ్య బాల్క సుమన

- మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన

రామకృష్ణాపూర్‌,ఏప్రిల్‌4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గెలిచిందనడానికి క్యాతనపల్లి మున్సిపల్‌ ఎన్నికలే నిదర్శనమని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన అన్నారు. శనివారం రామకృష్ణాపూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, సీపీఐ అభ్యర్థులను ప్రజలు ఎన్నుకున్నప్పటికీ మంత్రి వివేక్‌ అనేక ప్రలోభాలకు గురిచేసి, బీఆర్‌ఎస్‌ నాయకులపై, తనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారన్నారు. చివరికి ప్రజాతీర్పు ముందు ఇవన్నీ పటాపంచలయ్యాయని అన్నారు. తెలంగాణ సాధన కోసం జైళ్లకు వెళ్లి న చరిత్ర బీఆర్‌ఎస్‌ నాయకులను, కార్యకర్తలకు ఉందన్నారు. అలాంటి తమపై అక్రమ కేసులుపెట్టి అరెస్ట్‌లకు పాల్పడితే తలొగ్గుతామని మంత్రి వివేక్‌ వెంకటస్వామి అధికార దుర్వినియోగానికి పాల్పడడం ప్రజాపాలననేనా అని ప్రశ్నించారు. తాటాకు చప్పుల్లకు బయపడే పార్టీ బీఆర్‌ఎస్‌ కాదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చి పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటోందని విమర్శించారు.

కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ కూటమికి పూర్తిస్థాయి మెజార్టీ ఉన్నప్పటికీ క్యాతనపల్లి మున్సిపల్‌ పీఠాన్ని దక్కించుకోవడం కోసం మంత్రి వివేక్‌ పోలీసులను, అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజావ్యతిరేక పాలన చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ పాలనలో ఇప్పటికే రాష్ట్రం అధోగతికి చేరుకుందని ప్రజలంతా కేసీఆర్‌ పాలన కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ హైదరాబాద్‌, ఖమ్మంలో రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ఇళ్లను టార్గెట్‌ చేస్తూ అక్రమ కట్టడాలంటూ కూల్చివేస్తున్నారన్నారు. సీఎం రేవంతరెడ్డికి ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఏఐటీయుసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, సీపీఐ కార్యవర్గ సభ్యుడు కలవేణి శంకర్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడిన ఏఐటీయుసీ, సీపీఐ నాయకులపై మంత్రి వివేక్‌ చౌకబారు ప్రకటనలు చేయడం సరికాదన్నారు. సీపీఐ నమ్మిన సిద్దాంతాల కోసమే పని చేస్తుందని తెలిపారు. చైర్‌పర్సన సంధ్యారాణి, వైస్‌ చైర్‌పర్సన సరితకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావు, జడ్పీ మాజీ వైస్‌ చైర్మన మూల రాజిరెడ్డి, కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌ సింగ్‌, ఏఐటీయుసీ, సీపీఐ, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2026 | 11:44 PM