భక్తజన సంద్రం
ABN , Publish Date - Feb 01 , 2026 | 11:23 PM
మాఘశుద్ధ పౌర్ణమిసందర్భంగా రెబ్బెన మండలం గంగాపూర్ శివా రులోని బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఆది వారం నిర్వహించిన జాతరకు భక్తులు పోటెత్తారు.
- గంగాపూర్ జాతరకు పోటెత్తిన భక్తులు
- కన్నుల పండువగా రథోత్సవం
- ఉమ్మడి జిల్లాతో పాటు మహారాష్ట్ర వాసుల రాక
రెబ్బెన, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): మాఘశుద్ధ పౌర్ణమిసందర్భంగా రెబ్బెన మండలం గంగాపూర్ శివా రులోని బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఆది వారం నిర్వహించిన జాతరకు భక్తులు పోటెత్తారు. ఉమ్మడి జిల్లాతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి స్వామివారికి మొక్కులు సమర్పించుకున్నారు. తెల్లవారుజామున మూడు గంట ల నుంచి స్వామివారి దర్శనాన్ని ఆలయ కమిటీ ఆధ్వ ర్యంలో ప్రారంభించారు. ఉదయం భక్తులరాక అంతం త మాత్రంగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం వరకు ఆలయ ప్రాంగణానికి భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చారు. దీంతో గంగాపూర్ ఆలయ పరిసరాలు భక్తుల తాకిడి తో కిటకిటలాడింది. స్వామివారి ధర్మ దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనాన్ని ఏర్పాటు చేశారు. దీంతో భక్తులకు దర్శనం సులభతరంగా జరిగింది. సాయం త్రం స్వామివారి రథోత్సవాన్ని పురస్కరించుకొని ఆల యంలో పంచలోహ విగ్రహాలను పల్లకీలో బాజాభ జంత్రీలతో వేదపండితుల మంతోచ్ఛరణల మధ్య రథాలపైకి చేర్చారు. భక్తులు ఆనంద పారవశ్యంతో మునిగి తేలుతూ స్వామివారి రథోత్సవంలో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా సుమారు లక్షమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు అంచనా వేశారు.
నాయకుల, అధికారుల పూజలు..
బాలాజీ వేంకటేశ్వర స్వామిని పలువురు ప్రము ఖులు దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. ఆసిఫా బాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు, ఆసిఫాబా ద్ జడ్జి యువరాజ్, ఏఎస్పీ చిత్తరంజన్, రెబ్బెన సీఐ సంజయ్, గంగాపూర్ సర్పంచ్ వెంకటేశంచారి, రెబ్బెన సర్పంచ్ డి భరద్వాజ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ట్రాఫిక్ ఇబ్బందులు..
గంగాపూర్ జాతరకు ప్రతి సంవత్సరం భక్తుల రద్దీ పెరుగుతూనే వస్తోంది. దీంతో భక్తులు భారీ ఎత్తన వాహనాల్లో తరలివచ్చారు. వాహనాల రద్దీ ఎక్కువగాఉండడంతో రాకపోకలకు ఎక్కడిక్కడ అంతరాయం ఏర్పడింది. రైల్వే గేటు నుంచి గంగాపూర్ ఆలయం వరకు దశాబ్దాల క్రితం వేసిన సింగిల్‌రోడ్డు మాత్రమే ఉండడంతో పెరిగిన జనాభాకు అనుగుణంగా వాహ నాలకు ఈ రోడ్డు ఏ మాత్రం సరిపోవడం లేదు. దీం తో సింగిల్ రోడ్డు ఎప్పటికీ వస్తున్న వాహనాల మూ లంగా ట్రాఫిక్ జాం కావడంతో ట్రాఫిక్‌తో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి వాహనాలు గంగాపూర్ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే గత్యంతరం లేక నిలిపి వేసి భక్తులు కాలినకడన వచ్చారు. ఆలయానికి ఏటేటా ఆదరణ పెరుగుతున్నం దున డబుల్ రోడ్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని భక్తులు అభిప్రాయ పడుతున్నారు.
దాతల సహకారంతో అన్నదానం..
ఏటా మాదిరిగానే ఈసారి కూడా రెబ్బెన మండల కేంద్రానికి చెందిన పలువురు వర్తక వ్యాపారులు, దాత ల సహకారంతో జాతరకు వచ్చిన భక్తుల కోసం మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు 50 వేల మంది హాజరయ్యారు. వీరందరికి అన్నదానం చేశారు.