Share News

కాంగ్రెస్‌ అవినీతి పాలనను ఎండగడతా

ABN , Publish Date - Mar 04 , 2026 | 11:28 PM

కాంగ్రెస్‌ అవినీతి పాలనను ఎండగడతానని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు.

కాంగ్రెస్‌ అవినీతి పాలనను ఎండగడతా
క్యాతన్‌పల్లిలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌

- మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌

రామకృష్ణాపూర్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అవినీతి పాలనను ఎండగడతానని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో అక్ర మ అరెస్టులకు బయపడలేదని క్యాతన్‌పల్లి ఆదిలాబాద్‌ జైలు నుంచి విడుదలైన క్యాతన్‌పల్లికి వచ్చిన సందర్భంగా క్యాతన్‌పల్లిలో ఆయన నివాసం ఏర్పాటులో చేసిన విలేకరుల సమా వేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. క్యాతన్‌పల్లి మున్సిపల్‌ పీఠం బీఆర్‌ఎస్‌ ఎక్కడ కైవసం చేసుకుంటుందోనని పోలీసు, అధి కారుల అండతో ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకొని అక్రమంగా బీఆర్‌ ఎస్‌ నాయకులపై కేసులు పెట్టారని అయినా భయపడేదిలేదన్నారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ దుర్మార్గంగా మహిళ కౌన్సిలర్లపై అసభ్యకరంగా వ్యవహరించి రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందన్నారు. క్యాతన్‌పల్లి మున్సిపల్‌ ప్రజలు మంత్రి వివేక్‌ను, కాంగ్రెస్‌ పాల నను వ్యతిరేకించి బీఆర్‌ఎస్‌కు జైకొట్టడాన్ని జీర్ణించుకోలేకనే పదుల సంఖ్యలో బీఆర్‌ఎస్‌ నాయకులను అరెస్టు చేసి జైల్లో ఇబ్బందులకు గురిచేశారన్నారు. కాంగ్రెస్‌ను ప్రజలు తగిన గుణపాఠంచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టిన కాంగ్రెస్‌ అవినీతి పాలనను ఎండగడుతానని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాక ర్‌రావు, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మూల రాజిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

బాల్కసుమన్‌కు ఘన స్వాగతం

మంచిర్యాల కలెక్టరేట్‌/దండేపల్లి/లక్షెట్టిపేట /జన్నారం: అక్రమ కేసులు తన మనోధైర్యాన్ని దెబ్బతీయలేవని, ప్రభుత్వ అణచివేత ధోరణిని ఎండగడుతామని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్య క్షుడు, చెన్నూర్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు. ఇటీవల మంత్రి కాన్వాయ్‌పై దాడి ఘటనలో అరెస్టు అయిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్‌ రిమాండ్‌ అనంతరం బెయిల్‌పై జైలు నుంచి బుధవారం విడుదలయ్యారు. ఈ సందర్భంగా జన్నారం, లక్షెట్టిపేట, దండేపల్లి, మంచిర్యాలలో సుమన్‌కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. సుమన్‌ మాట్లాడుతూ తనకు అండగా ఉన్న నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞలు తెలి పారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్‌రావు, దండేపల్లి, లక్షెట్టిపేట, మంచిర్యాల, నస్పూర్‌కు చెందిన నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2026 | 11:28 PM