సింగరేణిని దోచుకుంటున్న కాంగ్రెస్ నాయకులు
ABN , Publish Date - Jan 21 , 2026 | 11:24 PM
కాంగ్రెస్ నాయకులు సింగరేణిని దోచుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి అన్నారు.
శ్రీరాంపూర్, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ నాయకులు సింగరేణిని దోచుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి అన్నారు. నైనీ బ్లాకును కాంగ్రెస్ నాయకులకు ధారాదత్తం చేసే ప్రయత్నం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం జీఎం మునిగంటి శ్రీనివాస్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డికి నైనీ బ్లాకును కట్టబెట్టే ప్రయత్నం జరిగిందన్నారు. ప్రజా పాలన పేరుతో సీఎం తన బంధువులకు తెలంగాణ సొమ్మును దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సైట్ విజిట్ పేరుతో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతూ, తమ అనుమాయులకు కాంట్రాక్టులు ఇచ్చేస్తుందన్నారు. తద్వారా పెద్దమొత్తంలో కమీషన్లు దండుకుంటు న్నారని ఆరోపించారు. సింగరేణి నిధులతో ఫుట్‌బాల్ క్రీడలు ఆడటం ఏమిటని వారు ప్రశ్నించారు. మెడికల్ బోర్డు ఏర్పాటు చేయా లని, ప్రైవేటీకరణ నుంచి సంస్థను కాపా డాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాం డ్ చేశారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు బండి రమే శ్, బీఆర్‌ఎస్ నస్పూర్ పట్టణాధ్యక్షుడు అక్కూరి సుబ్బన్న, టీబీజీకేఎస్ నాయకులు సత్తయ్య, లాల, అన్వేష్ రెడ్డి, మైపా ల్ రెడ్డి, సంతోష్, ఉత్తేజ్ రెడ్డి, రమేశ్ పిట్ కార్యదర్శులు, బీఆర్‌ఎస్ కార్యక ర్తలు తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి, (ఆంధ్ర జ్యోతి) : సింగరేణి బొగ్గు టెం డర్ల స్కామ్‌పై ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అ న్నారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ సంయుక్త కార్యదర్శి దాసరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బొగ్గు టెండర్లకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు బడికెల రమేష్, హన్మంతరావు, బత్తుల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.