Share News

రైతులను విస్మరిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

ABN , Publish Date - Apr 29 , 2026 | 11:54 PM

రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరిస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘనాథ్‌ వెరబెల్లి అన్నారు.

 రైతులను విస్మరిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం
కొనుగోలు కేంద్రంలో వడ్ల కుప్పల వద్ద రైతులతో మాట్లాడుతున్న రఘనాథ్‌ వెరబెల్లి

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘనాథ్‌ వెరబెల్లి

దండేపలి,్ల ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరిస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘనాథ్‌ వెరబెల్లి అన్నారు. బుధవారం మండలంలోని మేదరిపేటలో ఐకేపీ ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని పార్టీ శ్రేణులతో కలిసి సందర్శించారు. రైతులు ఆరబోసిన వడ్లను పరిశీలించి సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలు పోసి రోజులు గడుస్తున్నా రైస్‌మిల్లుల ట్యాగింగ్‌ రాలేదని, కాంటాలు వేయక రైతులు ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నారన్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారే తప్ప ధాన్యం కొనుగోలు చేయడం లేదని ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. వెంటనే మిల్లులకు ట్యాగింగ్‌ ఇచ్చి వెంటనే కాంటాలు వేసి కటింగ్‌ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యాన్ని కాంటాలు వేసి తూకం వేసిన ధాన్యంను వెనువెంట రైస్‌మిల్లులకు తరలించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కొనుగోలు కేంద్రాల్లోని నెలకొన్న సమస్యలను నేరుగా రైతులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ కిసాన మోర్చా రాష్ట్ర కార్యదర్శి రమణరావు, అసెంబ్లీ కన్వీనర్‌ గోపతి రాజయ్య, పార్టీ ప్రదాన కార్యదర్శి పుట్టపాక సంతోష్‌, నాయకులు ఎనగందుల కృష్ణమూర్తి, బెదుడ సురేష్‌, చిట్ల శ్రీనివాస్‌, పిట్టల అశోక్‌, రాస శ్రీనివాస్‌, నలిమెల మహేష్‌, లక్ష్మీనారాయణ, మొండయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2026 | 11:54 PM