కక్ష సాధింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
ABN , Publish Date - Feb 01 , 2026 | 11:25 PM
ఫోన్ టాపింగ్ కేసు పేరుతో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను విచారణకు పిలవడం కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు నిదర్శనమని ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్‌కుమార్ విమర్శించారు.
- ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్‌కుమార్
- మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులకు నిరసనగా బీఆర్‌ఎస్ నాయకుల ఆందోళన
ఆసిఫాబాద్‌రూరల్, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ఫోన్ టాపింగ్ కేసు పేరుతో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను విచారణకు పిలవడం కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు నిదర్శనమని ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్‌కుమార్ విమర్శించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి అధ్యక్షతన ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహిం చిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సాధించిన నాయకుడిపై కుట్రపూరితంగా కేసులు బనాయిస్తూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయ త్నం జరుగుతోందన్నారు. సిట్ నోటీసులు పూర్తి బూట కమని, రాజకీయ ఒత్తిడితో రూపొందించినవేని ఆరోపిం చా రు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ ప్రతిపక్షాలను అణివేయాలనే కాంగ్రెస్ కుట్రలను బీఆర్‌ఎస్ నాయకు లు సహించబోరని అన్నారు. తెలంగాణ సాధకుడైన కేసీఆర్‌పై జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని శ్రావణ్‌కుమార్ హెచ్చరించారు. ఈ సందర్భంగా నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ తీరుకు వ్యతి రేకంగా నినాదాలు చేశారు. అనంతరం పార్టీ కార్యాల యంలో నల్ల జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకుల సరస్వతి, రవీందర్, పోచయ్య, అలీబీన్ అహ్మద్, వెంకన్న, నిసార్, అశోక్, ఖాసీం, రవి, అఖిల్, జాకీర్, ఇమ్రాన్, హకీం, నారాయణ, సురేష్, బలరాం తదితరులు పాల్గొన్నారు.
రెబ్బెన: మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన లో నాయకులు శ్రీధర్‌రెడ్డి, మహేష్‌గౌడ్, సర్పంచ్‌లు భారధ్వాజ్, సుధాకర్, ఉపసర్పంచ్ దుర్గారావ్, వర లక్ష్మి, శ్రీనివాస్, అశోక్, మల్లేష్, పోషమల్లు, మురళీ, అబ్బు, రాజేష్, సాయికిరణ్, శంకరమ్మ, పద్మ, అరుణ, అహల్యదేవి, పద్మ తదితరులు పాల్గొన్నారు.
బెజ్జూరు: మండల కేంద్రంలో జరిగిన ఆందోళనలో సర్పంచ్‌లు చిన్నయ్య, కిరణ్, నాగేష్, ఉపసర్పంచ్ రవీం దర్‌గౌడ్, నాయకులు బషరత్‌ఖాన్, అమీరుద్దీన్, సకారాం, ఓం ప్రకాష్, జావీద్, శ్రీనివాస్, శేఖర్, రమేష్, ఇస్తారి తదితరులు పాల్గొన్నారు.
వాంకిడి: మండల కేంద్రంలో జాతీయ రహదారిపై బీఆర్‌ఎస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు. మాజీ జడ్పీటీసీ అజయ్‌కుమార్, సర్పంచ్ బావుజీ, నాయకు లు పెంటు, రాజ్‌కుమార్, ప్రవీణ్, రాజ్‌కుమార్, రాకేష్, రాంచందర్, వెంకట్, నారాయణ పాల్గొన్నారు.
కౌటాల: మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్ర మంలో సర్పంచ్‌లు శంకర్, బిక్కు, సంతోష్, వెంకటేష్, గోపాల్, నాయకులు వసంత్‌రావు, ఆనంద్‌రావు, శైలజ, సంతోష్, రవీందర్‌గౌడ్, వసంత్‌రావు, బాజీరావు, లహం చు, ప్రభాకర్‌గౌడ్, మధుకర్ పాల్గొన్నారు. కాగా పలువు రు బీఆర్‌ఎస్ నాయకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ సంతోష్‌కుమార్ తెలిపారు.
కెరమెరి: మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన లో నాయకులు అంబాజీ, అబ్దుల్ కలాం, దుర్పతాబా యమి, సర్పంచ్‌లు ఆనందరావు, అంబరావు, కొద్దు, నాగనాథ్, బుచ్చయ్య, నాయకుల జగన్నాథ్, సోము, యూనుస్, రూప్‌లాల్, దందు, నిసార్, వెంకటేష్, మున్ను, బాలాజీ, వినేష్, శ్రీరామ్, సోనాజీ, ఉమేష్, ముజీబ్, రాంచందర్, పోశం, తుకారాం, భీంరావు, తిరుపతి, జావీద్, తదితరులు పాల్గొన్నారు.
దహెగాం: మండల కేంద్రంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ ను దహనం చేశారు. కార్యక్రమంలో నాయకులు సంతో ష్‌గౌడ్, మల్లేష్, బాలకిషన్‌రావు, ప్రశాంత్ పాల్గొన్నారు.
జైనూర్: జైనూర్, సిర్పూర్(యు) మండల కేంద్రాల్లో బీఅర్‌ఎస్ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రధాన రోడ్డుపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమం లో సహకార సంఘం మాజీ చైర్మన్ కొడప హన్ను పటేల్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గెడాం లక్ష్మణ్, సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షుడు మడా వి భీంరావ్, మాజీ ప్రధానకార్యదర్శి మేస్రాం రాహుల్, బీఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షుడు ఆత్రం శంకర్, ముండె సతీష్, తదితరులు పాల్గొన్నారు.
లింగాపూర్: మండల కేంద్రంతోపాటు పలు గ్రామా ల్లో మాజీ జడ్పీటీసీ అడేలక్యా నాయక్, నాయకులు నూనావత్ కిషన్, బానోత్ కిషన్, గోవింద్, బాపూరావు, గన్‌పతినాయక్, అనిల్, జుగాదిరావు, రాహుల్, మనోహ ర్, దేవురావు, ప్రేమ్‌సింగ్ పాల్గొన్నారు.