Share News

‘వీబీ జీ రామ్‌జీ’ బిల్లుపై కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం

ABN , Publish Date - Jan 07 , 2026 | 11:32 PM

మోదీ ప్రభుత్వం తీసుకువచ్చి వీబీ జీ రామ్‌జీ బిల్లుపై తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాఽథ్‌ వెరబెల్లి అన్నారు.

‘వీబీ జీ రామ్‌జీ’ బిల్లుపై కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం
సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాఽథ్‌ వెరబెల్లి

మంచిర్యాల కలెక్టరేట్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): మోదీ ప్రభుత్వం తీసుకువచ్చి వీబీ జీ రామ్‌జీ బిల్లుపై తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాఽథ్‌ వెరబెల్లి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రం లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ పనుల్లో కమీషన్లు రావనే ఉద్దేశంతో ప్రధాని మంద్రి మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీ జీ రామ్‌జీ బిల్లును కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందన్నారు. గ్రామీణ పేద ప్రజలకు మరింత ఉపాధి కల్పించి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయాలని ప్రధాని ఈ బిల్లును తీసుకు వచ్చారన్నారు. రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్‌ నాయకులు బిల్లుపై అవగాహన లేకుండా మాట్లాడుతూ ప్రజల్లో తప్పుడు అపోహలు సృష్టి స్తున్నారని మం డిపడ్డారు. సమావేశంలో బీజేపీ నాయకులు గోలి రాము, వెరబెల్లి రవీంద ర్‌రావు, ముత్తె సత్తన్న, జోగుల శ్రీదేవి, కమలాకర్‌రావు, సతీష్‌రావు,తిరుపతి, వెంకటరమణరావు, రాపర్తి వెంకటేశ్వర్లు, అమిరిశెట్టి రాజ్‌కుమార్‌, సత్రం రమేష్‌, రంగ శ్రీశైలం, స్వామిరెడ్డి, హరిగోపాల్‌, రవి, రాజయ్య, మధుకర్‌, మొగిలి, కృష్ణదేవరాయలు, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు కంప్యూటర్‌ విద్య అందించడమే లక్ష్యం

నస్పూర్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యానభ్యసిస్తున్న పేద విద్యార్థులకు కంప్యూటర్‌ విద్య అందించాలన్న లక్ష్యంతో ఉచిత డిజిటల్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు రఘునాథ్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ రఘునాథ్‌ వెరబెల్లి తెలిపారు. నస్పూర్‌, సీతారాంపల్లి ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఐదు ల్యాప్‌ టాప్‌లు, 43 ఇంచుల ఎల్‌ఈడీ స్ర్కీన్‌, ఇంటర్నెట్‌ కనెక్షన్‌లను బుధవారం అందించారు. ఈ సందర్భంగా రఘునాథ్‌ మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు కంప్యూటర్‌ విద్య అందించడానికి ఏర్పాట్లు చేశామ న్నారు. జిల్లా వ్యాప్తంగా 12 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్‌ విద్యా అందిస్తామన్నారు. కార్యక్రమాల్లో కమాలాకర్‌రావు, సత్రం రమేష్‌, సతీష్‌రావు, ఈర్ల సదానం దం, శ్రీకాంత్‌, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2026 | 11:32 PM