Share News

నల్లబ్యాడ్జీలతో సమగ్ర శిక్ష సిబ్బంది నిరసన

ABN , Publish Date - Mar 09 , 2026 | 11:32 PM

కేజీబీవీ, యూఆర్‌ఎస్‌, సమగ్ర శిక్షణ ఉద్యోగుల సమస్య లను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఆసిఫాబాద్‌ పట్టణంలోని ఎంఆర్‌సీ కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

నల్లబ్యాడ్జీలతో సమగ్ర శిక్ష సిబ్బంది నిరసన
పెంచికలపేటలో నిరసన తెలుపుతున్న ఉద్యోగులు

ఆసిఫాబాద్‌రూరల్‌, మార్చి 9(ఆంధ్రజ్యోతి): కేజీబీవీ, యూఆర్‌ఎస్‌, సమగ్ర శిక్షణ ఉద్యోగుల సమస్య లను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఆసిఫాబాద్‌ పట్టణంలోని ఎంఆర్‌సీ కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందవర్భంగా వారు మాట్లాడుతూ గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి సమస్యల పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, కానీ నేటి వరకు అమలు చేయడం లేదన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష సిబ్బంది సంతోష్‌, అనూప్‌, వెంకటరమణ, తిరుపతి, సుబాష్‌, నగేష్‌, సంతోష్‌, కవిత తదితరులు పాల్గొన్నారు.

పెంచికలపేట: మండల కేంద్రంలో జరిగిన నిరసనలో కేజీబీవీ, టీఎస్‌యూటీఎఫ్‌ నాయకులు, ఉపాధ్యాయులు, రాజకమలాకర్‌రెడ్డి, కవిత, సమతకుమారి, శ్రీనివాస్‌, శ్యాం పాల్గొన్నారు.

రెబ్బెన: మండలంలోని ఎంఆర్‌సీ కార్యాలయం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్‌ నాయకులు దేవేందర్‌, రాజేష్‌, సత్యనారాయణ, రామయ్య తదితరులు పాల్గొన్నారు.

వాంకిడి: సమగ్ర శిక్షలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది సమస్యల పరిష్కారానికి మూడు దశల పోరాటాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు శృతిక కోరారు. సోమవారం టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఎంఆర్‌సీ ఎదుట కేజీబీవీ పాఠశాల ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు సందీప్‌, విజయబాబు, తిరుమల, వెంకటేష్‌, రైసా ఖాతూన్‌, లలిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2026 | 11:32 PM