Share News

మార్పులు...చేర్పులపై కసరత్తు

ABN , Publish Date - Jan 10 , 2026 | 11:28 PM

మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరా లు స్వీకరణ గడువు ముగిసింది. చివరిరోజు ఆసిఫాబాద్‌లో 108, కాగజ్‌నగర్‌లో 76 మొత్తం రెండు మున్సిపాలిటీల్లో 184 అభ్యం తరాలు వచ్చినట్లు అధికారులు ప్రకటిం చా రు.

మార్పులు...చేర్పులపై కసరత్తు
ఆసిఫాబాద్‌లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న మున్సిపల్‌ సిబ్బంది

- మున్సిపల్‌ ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు ముగిసిన గడువు

- మొత్తం 184 అభ్యంతరాలు

- రేపు తుది జాబితా ప్రకటన

ఆసిఫాబాద్‌రూరల్‌, జనవరి 10 (ఆంధ్ర జ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరా లు స్వీకరణ గడువు ముగిసింది. చివరిరోజు ఆసిఫాబాద్‌లో 108, కాగజ్‌నగర్‌లో 76 మొత్తం రెండు మున్సిపాలిటీల్లో 184 అభ్యం తరాలు వచ్చినట్లు అధికారులు ప్రకటిం చా రు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి పార్టీల నాయకుల అభిప్రాయాలను స్వీకరించారు. వీటన్నింటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి జాబితాలో మా ర్పులు, చేర్పులను చేపట్టి ఈనెల 12న తుది జాబితాను ప్రకటించనున్నారు. ఈ మేరకు శనివారం నుంచి ఆసిఫాబాద్‌, కాగ జ్‌నగర్‌ మున్సిపాలిటీలో మున్సిపల్‌ సిబ్బం ది ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నా రు.

అభ్యంతరాల పరిశీలన..

ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంత రాలు రావడం, ఒక వార్డు నుంచి మరో వార్డుకు వెళ్లడం, ఇతర ప్రాం తాల ఓటర్లు ప్రత్యక్షంకావడం తో వాటిని మార్చేందుకు మున్సిపల్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈనెల 2 నుంచి 9వ తేదీ వరకు వచ్చిన అభ్యం తరాలు, ఫిర్యాదులను పరిగణ లోకి తీసుకుంటున్నారు. తప్పిదా లు ఎలా జరిగాయనే విషయం పై పరిశీలించి మార్పులు, చేర్పులపై చర్య లు ప్రారంభించారు. వార్డుల వారీగా ఇంటి నంబర్లు పరిశీలించి అయా వార్డుల్లోనే ఓట ర్లు ఉండేలా చూస్తున్నారు. తుది జాబితాను ప్రకటించేలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల ని భావిస్తున్నారు. ఓటర్ల జాబితాలో అభ్యం తరాలను క్షేత్రస్థా యిలో పరిశీలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

జిల్లాలో 65,110 మంది ఓటర్లు..

జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులు ఉండగా ఇందులో 65,110 మంది ఓటర్లు ఉన్నారు.

ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలో 13,905 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషు లు 6,811 మంది, మహిళలు 7,082 మంది ఇతరులు ఇద్దరు ఉన్నారు. కాగజ్‌నగర్‌లో 51,205 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 25.004 మంది, మహిళలు, ఇతరులు ఏడుగురు ఉన్నారు.

Updated Date - Jan 10 , 2026 | 11:28 PM