జన గణనను జాగ్రత్తగా నిర్వహించాలి
ABN , Publish Date - Apr 22 , 2026 | 11:27 PM
జనగణన 2027 కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
- కలెక్టర్ కుమార్ దీపక్
చెన్నూరు, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): జనగణన 2027 కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం చెన్నూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్‌లకు ఇళ్ల గణనపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఇళ్ల గణనను పకడ్బందీగా చేపట్టాలన్నారు. జిల్లాలో గుర్తించబడిన ఇళ్ల జాబితా బ్లాక్ వివరాలను అందించడం జరుగుతుందన్నారు. మే 11 నుంచి నిర్వహించనున్న ఇళ్ల గణను జాగ్రత్తగా నిర్వహించాలని, ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటున్నందున ఉదయం వేళలో ప్రక్రియ నిర్వహించేలా కార్యచరణ రూఒపందించుకోవాలన్నారు ఇళ్ల యాజమానులకు ముందుగా సమాచారం అందిస్తే వారు అందుబాటులో ఉంటారని, పంచాయతీ కార్యదర్శి, మున్సిపల్ కమీషనర్ సమన్వయంతో ప్రక్రియ నిర్వహించాలన్నారు. ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లు సమయ పాలన పాటించాలని, ఇళ్ల గణన కొరకు నియమించబడిన అధికారులు ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రక్రియ నిర్వహించాలన్నారు. ఇళ్ల గణనలో సందేహాల నివృత్తి కోసం గ్రూప్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అంతకుముందు కిష్టంపేటలోని డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలన్నారు. పట్టణంలో చేపట్టిన స్కిల్ డెవలప్‌మెంట్ , ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు. కస్తూర్బా విద్యాలయాన్ని సందర్శించి అదనపు గదుల నిర్మాణం, వంటశాల, భోజనశాలలను పరిశీలించి విద్యార్థినీలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ మల్లికార్జున్, ఎంపీఎస్‌వో ప్రవీణ్‌కుమార్,ఫీల్డ్ ట్రైనర్లు సురేందర్, గోపికృష్ణ తదితరులు ఉన్నారు.
ఇళ్ల గణన పక్కాగా చేపట్టాలి
భీమిని: గ్రామాల్లో వచ్చే నెల 11 నుంచి చేపట్టే ఇళ్ల గణన పక్కాగా ఉండాలని తహసీల్దార్ బికర్ణ దాస్ సూచించారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో ఈనెల 18న ప్రారంభమైన ఎన్యూమరేటర్ల మొదటి విడత శిక్షణ తరగతులు బుధవారంతో ముగిసాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 11 నుంచి జూన్ 9 వరకు నిర్వహించే ఇళ్ల గణనపై సర్వేలో ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డిజిటల్ పద్ధతిలో డేటా సేకరణ, మౌలిక వసతులు, గృహాల వివరాలను మొబైల్ యాప్‌లో ఎలా నమోదు చేయాలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీఎస్‌వో వేణుగోపాల్, ఆర్‌ఐ కిషన్, శిక్షకులు శ్రీనివాస్, రమేష్, ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.