Share News

జనగణన విధులు సమర్థవంతంగా నిర్వహించాలి

ABN , Publish Date - Mar 11 , 2026 | 11:43 PM

జనాభా లెక్క ల విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ఆదేఽశించారు. బుధవారం సమీకృత కలెక్టరేట్‌ భవన సమా వేశ మందిరంలో అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్య క్రమానికి కలెక్టర్‌ హాజరై మాట్లాడారు.

జనగణన విధులు సమర్థవంతంగా నిర్వహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, పక్కన బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌

- కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): జనాభా లెక్క ల విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ఆదేఽశించారు. బుధవారం సమీకృత కలెక్టరేట్‌ భవన సమా వేశ మందిరంలో అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్య క్రమానికి కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకా లను సమర్ధవంతంగా అమలు చేసేందకు జనాభా లెక్కలు ప్రతి పాదికగా ఉపయోగపడతాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డిజిటల్‌ పద్ధతిలో జనాభా గణనను నిర్వహించ డానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. జనగణన ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు. పాఠశాలలు, ఆసుపత్రులు, రహదారులు, తాగునీటి సదుపాయాలు వంటి మౌలిక వసతుల కల్పనకు, సంక్షేమ పథకాలు అర్హులకు చేరవేయడానికి కచ్చిత మైన గణాంకాలు అవసరమని తెలిపారు. వయస్సు, విద్యార్హత, వృత్తి, సామాజిక వర్గం, మౌలిక వతసుల వివరాలు వంటి అంశాల్లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించా లని ఆదేశించారు. 33 అంశాలపై సమగ్ర సమాచారం సేకరించా లని తెలిపారు. మొదటి దశలో నివాస గృహాలతో పాటు అన్ని రకాల భవనాలు, కుటుంబ వివరాలను, రెండో దశలో వ్యక్తిగత వివరాల సేకరణ ఉంటుందన్నారు. అధికారులు, ఎన్యుమరేటర్లు సమన్వయంతో పనిచేయాలని, అధికారులు ప్రతీరోజు జనాభా గణన ప్రక్రియను సమీక్షించాలని తెలిపారు. కార్యక్రమంలో బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌, తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

పనులు త్వరగా పూర్తి చేయాలి

చెన్నూరు, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొ న్నారు. బుధవారం ఆసుపత్రి నిర్మాణ పను లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్ట ర్‌ మాట్లాడుతూ నిర్మాణం త్వరగా పూర్త య్యేలా చూడాలన్నారు. అనంతరం పట్ట ణంలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్య క్రమంలో భాగంగా చేపట్టిన పారిశుధ్య పనులను పరిశీలించారు. గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాశాలను సంద ర్శించి భోజనశాల, పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు.

Updated Date - Mar 11 , 2026 | 11:43 PM