Share News

విద్యావారోత్సవాలను ఘనంగా నిర్వహించండి

ABN , Publish Date - May 09 , 2026 | 11:50 PM

: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి నిర్వహించే విద్యావారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు.

విద్యావారోత్సవాలను ఘనంగా నిర్వహించండి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అదనపు కలెక్టర్లు, అధికారులు

ఆసిఫాబాద్‌, మే 9(ఆంధ్రజ్యోతి): ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి నిర్వహించే విద్యావారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌ నుంచి ఉన్నతాధికారులతో కలిసి వీసీ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్‌లు, అదనపు కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో ప్రజాపా లన-ప్రగతిప్రణాళిక కార్యచరణలో విద్యా వారోత్సవా లు, ధాన్యం కొనుగోలు, ఫార్మర్‌ రిజిస్ట్రీ, జన గణన స్వీయ ధ్రువీకరణ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాల ద్వారా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని తెలిపారు. కొనుగో లు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించామని, తూకం యంత్రాలు, ప్యాడీ క్లీనర్‌లను అందుబాటులో ఉంచామని తెలిపారు. రైతు నమోదు ప్రక్రియ అన్ని జిల్లాలో 100 శాతం పూర్తయ్యేలా చూడాలని తెలిపా రు. జనగణన 2027లో భాగంగా ఈ నెల 10వ తేదీ వరకు స్వీయ గణన కార్యక్రమం నిర్వహించాలని, ప్రజలందరికి తెలిసే విధంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. ఈ నెల 11వ తేదీ నుంచి ఇండ్ల గణన కార్యక్రమం చేపట్టడం జరుగు తుందని తెలిపారు. రాష్ట్రంలో 10 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, వీరంతా స్వీయ గణన చేసుకోవాలని ఆదేశించారు. ప్రజాపాలన- ప్రగ తి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి నిర్వహించే విద్యావారోత్సవాలను విజయ వంతం చేయాలని తెలిపారు.

జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాల యాల భవన సముదాయంలో గల వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి జిల్లా అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భం గా అదనపు కలెక్టర్‌ మాట్లాడు తూ జిల్లాలో రైతు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని పంచాయతీ కార్యదర్శుల సహ కారంతో ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నామని తెలి పారు. ధాన్యం కేంద్రాలను స మర్థవంతంగా నిర్వహించేం దుకు సంబంధిత శాఖాధికా రులు సమన్వయంతో కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలను కార్యాచ రణ ప్రకారం పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతామన్నాని వివరిం చారు. 11వ తేదీ నుంచి ప్రారంభించనున్న ఇళ్ల గణన కార్యక్రమ నిర్వహణ కోసం ఎన్యూమరేటర్లు, సూపర్‌ వైజర్లు శిక్షణ పూర్తి చేశామని, జిల్లాలో సమర్థ వంతంగా కార్యక్రమం నిర్వహణ కోసం కృషిచేస్తామని తెలిపారు. కార్యక్ర మంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2026 | 11:50 PM