పాత కక్షలతో యువకుడి దారుణ హత్య
ABN , Publish Date - May 23 , 2026 | 11:30 PM
పాత కక్షలు, కుటుంబ కలహాలతో దహెగాం మండ లం మొట్లగూడ గ్రామంలో శనివారం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
దహెగాం, మే 23(ఆంధ్రజ్యో తి): పాత కక్షలు, కుటుంబ కలహాలతో దహెగాం మండ లం మొట్లగూడ గ్రామంలో శనివారం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్సై రమేష్, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వగాడే ఆనంద్‌రావు(26) అనే యువకుడిని అదే గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులు పాతకక్షలు మనసులో పెట్టుకు ని కర్రలు, బండలు, కత్తులతో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వరుసకు మేనమరదలు అయిన దుర్గం శిరీషను శిరీషా, శీవేషా అంటూ ఆనంద్‌రావు పాటపాడగా శిరీష ఇంటికి వెళ్లి వారి అమ్మ గిరిజకు చెప్పింది. ఆ మాటలు విన్న తల్లికూతుళ్లు ఆనంద్‌రావును ధూషిస్తూ అతనిపై దాడికి యత్నించారు. ఆనంద్‌రావు కత్తితో బెదిరిస్తూ వారిని వెంబడించారు. దీంతో దుర్గం శంకర్, దుర్గం దిలీప్, దుర్గం వినోద్, దుర్గం మనోజ్, దుర్గం గిరిజన, దుర్గం చిన్నక్క, దుర్గం శిరీష కత్తులు, కర్రలు, బండలతో దాడిచేయగా ఆనంద్‌రావు అక్కడికక్కడే మృతి చెందాడు. గతంలో వగాడే ఆనంద్‌రావు, దుర్గం శంకర్ కుటుంబాల మధ్య పాతకక్షలు ఉన్నాయి. దుర్గం శంకర్ ఇంటికి గతంలో ఆనంద్‌రావు విద్యత్ షాక్‌ను ఏర్పాటు చేయగా గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. మృతుడి సోదరి భాగ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా సంఘటన స్థలాన్ని కాగజ్‌నగర్ డీఎస్పీ వహిదుద్దీన్, కాగజ్‌నగర్ రూరల్ ఎస్సై కుమారస్వామి సందర్శించి హత్యకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.