Share News

విద్యార్థులను పాఠశాలకు తీసుకురండి

ABN , Publish Date - Jun 19 , 2026 | 11:32 PM

పాఠశాలకు విద్యా ర్థులను తీసుకురావాలని, విద్యార్థుల సంఖ్యను పెంచాల ని ఐటీడీఏ పీవో మంద మకరందు సూచించారు.

విద్యార్థులను పాఠశాలకు తీసుకురండి
కోటపల్లిలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను పరిశీలిస్తున్న ఐటీడీఏ పీవో మంద మకరందు

- ఐటీడీఏ పీవో మంద మకరందు

- ఆశ్రమ పాఠశాలల సందర్శన

కోటపల్లి, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): పాఠశాలకు విద్యా ర్థులను తీసుకురావాలని, విద్యార్థుల సంఖ్యను పెంచాల ని ఐటీడీఏ పీవో మంద మకరందు సూచించారు. మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ను ఆయన శుక్రవారం సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులు ఎవరు లేకపోవడంతో పాఠశాల సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ప్రారంభమై ఐదు రోజులు గడుస్తున్నా విద్యార్థులు ఎవరు పాఠశాల కు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. పాఠశాల లోని ఉపాధ్యాయులందరు విద్యార్థినుల ఇళ్లకు వెళ్లి తీసుకురావాలని, మరో రెండు రోజుల తర్వాత మళ్లీ వస్తానని అప్పటి వరకు పూర్తిస్థాయిలో విద్యార్థినీలు ఉం డాలని ఆయన ఆదేశించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించగా అక్కడ ఆదివాసీ జిల్లా నాయకులు బోయిని నగేష్‌ ఆదివాసీల సమస్యలపై ఐటీడీఏ పీవోకు వినతిపత్రం అందించారు. పోడు భూ ములు తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో కోటపల్లి రాపనపల్లి శెట్‌పల్లి, సర్వాయి పేట సర్పంచులు ఆలూరి సంపత్‌, అక్కల ప్రభాకర్‌, గోపికృష్ణ, రాజేష్‌ డీటీడీవో రమాదేవి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వేమనపల్లి: వేమనపల్లిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను శుక్రవారం ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు సందర్శించారు. విద్యార్థుల కు అందుతున్న విద్య, వసతి, ఆహార సదుపాయాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మెనూ ప్రకారం పోషకాహారంతో కూడిన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం వసతి గృహాలను పరిశీలించి భవనాలకు మరమ్మతులు అవసరం అయితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ప్రతి విద్యా ర్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. సీజనల్‌ వ్యాధుల బారిన విద్యార్థులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రికార్డులు, రిజిష్టర్‌లు సక్రమంగా నిర్వహించా లన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నేరుగా మాట్లాడి బోజనం, తాగునీరు, విద్య సౌకర్యాలపై వారి అభిప్రాయాల ను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెం ట డీటీడీవో శ్రీదేవి, ఏటీడీవో సురేష్‌, ప్ర ధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.

- నర్సరీ పరిశీలన

భీమారం: భీమారంలోని ఉద్యాన నర్సరీని ఉట్నూరు ఐటీడీఏ పీవో మంద మకరందు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఉట్నూరు ఐటీడీఏ పరిధిలోని ఉద్యాన నర్సరీలను బలోపేతం చేసి రైతులకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రైతులకు ఉపయోగపడే విధంగా అన్నిరకాల పంటలపై అవగాహన, శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఐటీడీఏ ప్రాజెక్టు ఉద్యాన అధికారి నర్సయ్య, జిల్లా గిరిజన సంక్షే మ అధికారి రమాదేవి, ఉద్యాన అధికారి సందీప్‌కుమార్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 19 , 2026 | 11:32 PM