Share News

వైభవంగా భోగి ఉత్సవాలు

ABN , Publish Date - Jan 14 , 2026 | 11:55 PM

జిల్లా వ్యాప్తంగా భోగి పండగను ప్రజలు బుధవారం ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉదయం ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పె ట్టారు. ఆయా గ్రామాల్లో ప్రజలు భోగి మంటలు వేశారు. న్నారులకు భోగి పండ్లు పోసి కుటుంబసభ్యులు ఆశీర్వా దించారు. సంక్రాంతి పండగ అందరికి ఆనందాన్ని కలిగిం చాలని కోరుకుంటూ ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

వైభవంగా భోగి ఉత్సవాలు
హాజీపూర్‌ మండలం పడ్తనపల్లిలో భోగి వేడుకల్లో మహిళల నృత్యాలు

జిల్లా వ్యాప్తంగా భోగి పండగను ప్రజలు బుధవారం ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉదయం ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పె ట్టారు. ఆయా గ్రామాల్లో ప్రజలు భోగి మంటలు వేశారు. న్నారులకు భోగి పండ్లు పోసి కుటుంబసభ్యులు ఆశీర్వా దించారు. సంక్రాంతి పండగ అందరికి ఆనందాన్ని కలిగిం చాలని కోరుకుంటూ ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

దండేపల్లి జనవరి 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో భోగి పండుగ వేడుకాలను బుధవారం వైభవంగా జరుపుకున్నారు. దేవాలయాల్లో భక్త్తులు భోగి పూజలను ఘనంగా నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.

తాండూర్‌: మండలంలోని కిష్టంపేట, తాండూర్‌ బ స్టాండ్‌ ప్రాంతంలో కాలనీ వాసులు తెల్లవారుజామున భోగి మంటలు వేశారు. యువకులు, మహిళలు, చిన్నారు లు పాల్గొన్నారు.

చెన్నూరు/నస్పూర్‌/జన్నారం: చెన్నూరు పట్టణంలో, మండలంలో, నస్పూర్‌లో, జ న్నారం మండలంలో ప్రజలు ఉదయం భోగి మంటలు వేసి పాత వస్తువులను మంటల్లో వేశారు.

కోటపల్లి: మండలంలోని సిర్సా గ్రామంలో బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పెద్దింటి స్వప్నపున్నంచంద్‌ ఆధ్వర్యంలో గ్రామస్థులతో కలిసి భోగి మంటలు వేశారు.

హాజీపూర్‌: మండలంలోని పడ్తనపల్లి గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ సర్పంచు గొల్ల శ్రీనివాస్‌, గ్రామపెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

మంచిర్యాల కలెక్టరేట్‌: జిల్లా కేంద్రంలోని బాయ్స్‌ స్కూల్‌ మైదానంలో వాకర్స్‌ అసోసియేషన్‌ గౌరవా ధ్యక్షుడు బొమ్మసత్తిరెడ్డి ఆధ్వర్యంలో భోగి మంటలను వేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు చంద్రమౌళి, సభ్యులు బద్రు, వెంకటేష్‌, సుధీర్‌, గట్టయ్య, వీరశంకర్‌ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం భోగి పండగను వాకర్స్‌ అసోసి యేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్ర మంలో ముక్త శ్రీనివాస్‌, రవీందర్‌, వేణుగోపాల్‌, మహే ష్‌,రెడ్డి, అశోక్‌, సంపత్‌, స్వామి, శ్రీనివాస్‌, మధుకర్‌, సత్యనారాయణ, భీమన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2026 | 11:55 PM