మెరుగైన వైద్య సేవలు అందించాలి
ABN , Publish Date - Feb 23 , 2026 | 11:26 PM
ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే వారందరికి మెరుగైన వైద్య సేవలు అందిచాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు వైద్య సిబ్బందికి సూచించారు.
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు
లక్షెట్టిపేట, పిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే వారందరికి మెరుగైన వైద్య సేవలు అందిచాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు వైద్య సిబ్బందికి సూచించారు. లక్షెట్టిపేట పట్టణంలోని 30పడకల ఆసుపత్రిని ఎమ్మెల్యే సోమవారం సందర్శించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే వైద్యం కోసం వచ్చిన ఇన్ పేషంట్లతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్యులతో పాటు వైద్య సిబ్బంది ఆసుపత్రిలో అందుబాటులో ఉండాలన్నారు. వైద్యం కోసం వచ్చిన వాళ్లతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యం గురించి తెలుసుకోవడంతో పాటు కావాల్సిన అవసరాలను పరికరాలను వైద్యాధికారి ఆకుల శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల విషయంలో తనకు ఎలాంటి ఫిర్యాదులు అందినా సహించనని వైద్య సిబ్బందిని హెచ్చరించారు. కార్యక్రమంలో గిరిజన కోఆపరేటీవ్ డెవలప్‌మెంట్ చైర్మన్ కోట్నాక తిరుపతి, మున్సిపల్ చైర్మన్ దొంత అంజలినర్సయ్య, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ ఆరీఫ్, వైద్యులు సురేష్, స్రవంతిరావు, వంశీ, మున్సిపల్ కౌన్సిలర్లు, ఆసుపత్రి సిబ్బంది, నాయకులు ఉన్నారు.
విద్యార్థులు చదువుల్లో రాణించాలి
ప్రతీ విద్యార్థి చదువుల్లో రాణిస్తు మంచి క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు సూచించారు. లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఏర్పాటు చేసిన కళాశాల వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలపై దృష్టి సారించాలన్నారు. లక్షెట్టిపేట పట్టణంలో ఉన్న కళాశాల పాఠశాల రాష్ట్రంలోనే రోల్ మోడల్‌గా పేరు సంపాదించిందన్నారు. తాను ఒకప్పుడు ఇదే కళాశాలలో చదువుకుని ఇప్పుడు నియోజకర్గ ఎమ్మెల్యే అయ్యానంటే అది కళాశాల గొప్పతనమే అన్నారు. ప్రతీ విద్యార్థి ఒక లక్ష్యం ఎంచుకుని దాని సాదించేందుకు పట్టుదలతో చదవాలని జీవితంలో మంచి ఉద్యోగం సంపాదించి చదువుకున్న కళాశాలకు, తల్లితండ్రులకు మంచిపేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పాటు కళాశాల సిబ్బంది విధ్యార్థులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జీసీసీ చైర్మన్ కోట్నాక తిరుపతి, మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నర్సయ్య, కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మణ్‌రావు, ఆర్టీఏ మెంబర్ శ్రీనివాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ ఆరీఫ్, కళాశాల అద్యాపకులు, విధ్యార్థులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.