క్రీడాకారులు జిల్లా, రాష్ట్రస్థాయికి ఎదగాలి
ABN , Publish Date - Feb 01 , 2026 | 11:27 PM
గ్రామీణ ప్రాంత క్రీడాకారు లు జిల్లా, రాష్ట్రస్థాయికి ఎదగాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం సూచించారు. స్వామి వివే కానంద జయంతి, సంక్రాంతి పం డుగను పురస్కరించుకొని బీజేపీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిర్వహించిన క్రికెట్ టోర్నీలో గెలు పొందిన విజేతలకు ఆదివారం ఆయన బహుమతులను అందజే శారు.
వాంకిడి, ఫిబ్రవరి 1 (ఆంధ్ర జ్యోతి): గ్రామీణ ప్రాంత క్రీడాకారు లు జిల్లా, రాష్ట్రస్థాయికి ఎదగాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం సూచించారు. స్వామి వివే కానంద జయంతి, సంక్రాంతి పం డుగను పురస్కరించుకొని బీజేపీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిర్వహించిన క్రికెట్ టోర్నీలో గెలు పొందిన విజేతలకు ఆదివారం ఆయన బహుమతులను అందజే శారు. ఈ సందర్భంగా శ్రీశైలం మాట్లాడుతూ గ్రా మీణ ప్రాంతాల్లో క్రీడా పోటీలు నిర్వహించడం వల్ల వారిలో ఉన్న ప్రతిభను వెలికితీసే అవకాశం ఉంద న్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభ గల క్రీడా కారులను ప్రోత్సహించేందుకు బీజేపీ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. పోటీల్లో గెలిచిన స్వరాజ్ లెవెన్ జట్టుకు మొదటి బహుమతిగా 50వేల రూపాయల నగదుతో పాటు షీల్డు, బీజేపీ ఎలెవన్ జట్టుకు రెండో బహుమతిగా 25వేల రూపాయల నగదు, షీల్డును అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కోట్నక విజయ్, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సుచిత్, వాంకిడి, ఖిరిడి ఉపసర్పంచులు దీపక్, సాగర్, బీజేపీ నాయకులు మారుతి, విశాల్, వికాస్, గోల్ల, బండె శంకర్, విలాస్, హంసరాజ్ తదితరులు పాల్గొన్నారు.