Share News

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలి

ABN , Publish Date - May 27 , 2026 | 11:23 PM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాలో పర్యటనకు అవసరమైన ఏర్పాట్ల ను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ కె హరిత సూచించారు.

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిత, పాల్గొన్న అధికారులు

- కలెక్టర్‌ కె హరిత

ఆసిఫాబాద్‌, మే 27(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాలో పర్యటనకు అవసరమైన ఏర్పాట్ల ను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ కె హరిత సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీ క్షించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ జూన్‌ 1న కెరమెరి మండలం కొత్తగూడ కొఠారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నివాస గృహాల ప్రారం భోత్సవ కార్యక్రమం, లబ్ధిదారులతో కలిసి భోజనం, ముఖాము ఖీ కార్యక్రమం ఉన్నందున హెలీప్యాడ్‌ వద్ద ప్రముఖు లకు స్వాగతం గ్రామస్తులతో మాట్లాడటం ఉన్నందున షామీయనాలు, పార్కింగ్‌, నిరంతరం విద్యుత్‌ సరఫరా ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

అదేరోజు సాయంత్రం కాగజ్‌నగ ర్‌ ఎక్స్‌రోడ్డు వద్ద బహిరంగసభ ఉన్నందున సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా తాగునీరు అందించాలని సభ ప్రదేశంలో పారిశుధ్య పనులు చేపట్టాలని సూచించా రు. కొఠారి నుంచి కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్డు బహిరంగసభ కు రోడ్డు మార్గాన వస్తున్నం దున అవసరమైన ఏర్పా ట్లు చేయాలని సూచించారు. అధికారులు సమన్వ యంతో వ్యవహరించి సీఎం పర్యటనను విజయవం తం చేయాలని తెలిపారు. అంతకు ముందు ఈనెల 29న ఆసిఫాబాద్‌ మండలం రౌటసంకెపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా పర్యటించ నున్నారన్నారు. కలెక్టరేట్‌లో అధికారులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై సమీక్ష నిర్వహిస్తారని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. సమా వేశంలో ఎస్పీ నితికా పంత్‌, అదనపు కలెక్టర్లు యువ రాజ్‌ మర్మాట్‌, డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ద శుక్లా, డీఆర్వో వేణు, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, అదికారులు పాల్గొన్నారు.

సీఎం పర్యటన ఏర్పాట్ల పనుల పరిశీలన

కెరమెరి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూన్‌ 1న మండలంలోని కొత్తగూడ కొఠారి గ్రామానికి వస్తున్నం దున అక్కడ జరిగే ఏర్పాట్ల పనులను కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్జి శ్యాంనాయక్‌, మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మంగ బుధవారం పరిశీలించారు. కొత్తగూడలో నిర్మిం చిన ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. హెలీప్యాడ్‌, తదితర వాటిని పరిశీలించారు. సీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శాంతబాయి, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ అబ్దుల్లా, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2026 | 11:23 PM