మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తిచేయాలి
ABN , Publish Date - Jan 05 , 2026 | 11:23 PM
జిల్లాలో మున్సిపల్ ఎన్నిక ల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అధికారులను ఆదేశాంచారు.
- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మున్సిపల్ ఎన్నిక ల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అధికారులను ఆదేశాంచారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి ఆసిఫాబా ద్, కాగజ్‌నగర్ మున్సిపల్ కమిషనర్లు, వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లతో మున్సిపల్ ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, కేం ద్రాల్లో ఏర్పాట్లు, మున్సిపల్ పరిధిలోని ఇంటి పన్ను వసూలు అంశాలపై సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నిక నిర్వహణలో భాగంగా ఈ నెల 8వ తేదీ వరకు ఓటరు జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించాలని సూ చించారు. ఒకే కుటుంబంలోని ఓటర్లు ఒకే వార్డులో ఉండే విధంగా చర్య లు తీసుకోవాలని, ఆసిఫాబాద్‌లో 20, కాగజ్‌నగర్‌లో 30 వార్డులకు గాను పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయా లని తెలిపారు. మున్సిపాలిటీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధిం చిన ఇంటి పన్ను, ఇతర పన్నులు వందశాతం వసూలు చేయాలని ఆదే శించారు. అన్ని వార్డుల్లో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టి ఎప్పటి కప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు గజానన్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ప్రజావా ణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమా వేశ మందిరంలో అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తుల ను సోమవారం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించే దిశగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని, దరఖాస్తుదారులకు భరోసా కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
విన్నపాల వెల్లువ..
- జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల జరిగి న డైట్ టెండర్లలో అవకతవకలకు చోటు చేసుకున్నా యని, స్థానికులకు కాకుండా వేరే జిల్లాల వారికి టెండర్ ఇచ్చారని వెంటనే టెండర్ రద్దు చేయాలని ఆదివాసీ ప్రజా సంఘాల నాయకులు యావరావు, దినకర్, కార్తీక్‌లు అర్జీ సమర్పించారు.
- ఆసిఫాబాద్ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అసిస్టెంట్ లేబ ర్ ఆఫీసర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మున్సిప ల్ కార్మికులు కోరారు.
- రెబ్బెన మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన అమ్మక్క గ్రామ శివారులో గల ప్రభుత్వ భూమిని కబ్బా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని దరఖాస్తు సమర్పించారు.
- కాగజ్‌నగర్ మండలం అంకుశా పూర్ గ్రామానికి చెందిన సోమయ్య తన పేరిట గ్రామంలో పట్టా భూమి ఉందని, మోకాపై తక్కువగా ఉందని చూపుతున్నారని కోతలు చేసి హద్దులు నిర్ధారించాలని కోరారు.
- కాగజ్‌నగర్ పట్టణానికి చెంది న లలిత తన కుమారుడు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ మరణించాడని బీమా డబ్బులు ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.
- ఆసిఫాబాద్ మండలం ఈదులవాడకు చెందిన మారిశెట్టి వెంకయ్య తాను సాగుచేస్తున్న భూమిని ఆన్‌లైన్‌లో ఎక్కించాలని దరఖాస్తు అందజేశారు.
- ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట గ్రామానికి చెందిన అమ్ముబాయి తన ఆధీనంలో గల వ్యవసాయ భూమిని పట్టాచేసి ఇవ్వాలని అర్జీ సమర్పించారు.