‘ప్రజావాణి’కి వినతుల వెల్లువ
ABN , Publish Date - Mar 09 , 2026 | 11:35 PM
ప్రజవాణిలో వచ్చిన దరఖాస్తు లను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ హరిత అన్నా రు.
అర్జీలు స్వీకరించిన కలెక్టర్ కె హరిత
ఆసిఫాబాద్‌రూరల్, మార్చి 9(ఆంధ్ర జ్యోతి): ప్రజవాణిలో వచ్చిన దరఖాస్తు లను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ హరిత అన్నా రు. సోమవారం సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. అర్జీదారుల నుంచి దరఖా స్తులు స్వీకరించారు.
వాంకిడి మండలంలోని జైత్‌పూర్‌కు చెందిన సరిత తనకు దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. రెబ్బెన మండలం వంకులం గ్రామానికి చెందిన శంకరమ్మ తనకు ఏదైనా ఉపాధి కల్పించాలని దరఖాస్తు చేసుకు న్నారు. ఆసిఫాబాద్ మండలం ఈదులవాడ గ్రామానికి చెందిన మల్లేష్ పత్తి పంట నష్ట పోయినందున పరిహా రం ఇప్పించాలని, సిర్పూర్(టి) మండల కేంద్రానికి చెంది న రవి తాను ప్రభుత్వ భూమిని సాగు చేస్తున్నం దున లావుని పట్టా మంజూరు చేయాలని కోరారు. పెంచికలపేట మండలం పోతెపల్లికి చెందిన సర్పంచ్ పోశన్న తమ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరిం చాలని, జైనూర్ మండలం ఆశపల్లికి చెందిన హరి తన వ్యవసాయ చేనులో సాగునీటి బావి కూలి పోయినం దున మరమ్మతులు చేయడానికి నిధులు మంజూరు చేయాలని దరఖాస్తు అందజేశారు. ఆసిఫాబాద్ మండ లం గుండి గ్రామానికి చెందిన బిక్కాజీ ఇతర డాటా ఎంట్రీ అపరేటర్లు ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే వివరాలు ఆన్‌లైన్ చేసిన డబ్బులు చెల్లించాలని దరఖా స్తు చేసుకున్నారు.
సిర్పూర్(టి) మండలం జైభీంనగర్‌కు చెందిన తులసీ రాం తన తండ్రి వారసత్వంగా వస్తున్న భూమిని పట్టా చేయడానికి దరఖాస్తు సమర్పించారు. వెల్ఫేర్ బోర్డు ద్వారా నామినికి వచ్చే బెనిఫిట్ డబ్బులు ఇప్పించాలని రెబ్బెన మండలం గోలేటికి చెందిన మల్లేశ్వరి వినతి పత్రం సమర్పించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జన్కపూర్ ప్రాంతంలో శ్వశాన వాటిక నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ కాలనీ వాసులు నాగరా జు, నారాయణ, శైలేందర్, యాదగిరి అర్జీ సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ టీఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ధర్మయ్య, నాయకులు మల్లేష్, అశోక్ వినతిపత్రం అంద జేశారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.