సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:04 AM
జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదని ఎస్పీ నితికా పంత్ తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సిలిండర్ల కొరతపై సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవ ద్దని, జిల్లాలో ఎలాంటి కొరత లేదని తెలిపారు.
- ఎస్పీ నితికా పంత్
ఆసిఫాబాద్, మార్చి 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదని ఎస్పీ నితికా పంత్ తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సిలిండర్ల కొరతపై సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవ ద్దని, జిల్లాలో ఎలాంటి కొరత లేదని తెలిపారు. ఆన్‌లైన్ బుక్ చేసుకున్న వినియోగదారులకు సమయానికి సిలిండ ర్ అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. అక్రమ నిల్వలు జరగకుండా మధ్యవర్తులు అధిక ధరలకు విక్రయించకుండా ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించా రు. అన్నారు. సిలిండర్ బుక్ చేసుకున్న విని యోగదారులకు డెలివరీ బాయ్ అధిక ధరల కు విక్రయిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని, అలాంటి వారిపై కూడా కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు.
బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి
ప్రజాఫిర్యాదు విభాగంలో వచ్చే ఫిర్యాదులు పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసు అధికారులను ఎస్పీ నితికా పంత్ ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాఫిర్యాదుల విభాగం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫిర్యాదదారు ల సమస్యలను విని వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతా ల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి పరిష్కారానికి సంబంధిత డీఎస్పీ, ఏఎస్పీ, సీఐలతో ఫోన్‌లో మాట్లాడి సమస్య స్థితిని, పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవీలు లేకుం డా స్వచ్ఛందంగా పోలీసు సేవలన్ని వినియో గించుకోవాలని సూచించారు. సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించకోనేలా పోలీసులు ప్రజ లకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు.