Share News

పది ఫలితాల్లో 97.20శాతం ఉత్తీర్ణత

ABN , Publish Date - Apr 29 , 2026 | 11:51 PM

ఎస్సెస్సీ ఫలితాల్లో జిల్లాలో 97.20శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

పది ఫలితాల్లో 97.20శాతం  ఉత్తీర్ణత

- రాష్ట్రస్థాయిలో జిల్లాకు 20వ ర్యాంక్‌

మంచిర్యాలక్రైం, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): ఎస్సెస్సీ ఫలితాల్లో జిల్లాలో 97.20శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 9,684 మంది విద్యార్థులు హాజరు కాగా 9,413మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 4879 మంది బాలురు హాజరు కాగా 4720 మంది ఉత్తీర్ణులై 96.74 ఉత్తీర్ణత సాధించగా బాలికలు 4805 మంది పరీక్షలకు హాజరు కాగా 4693 మంది విద్యార్థినులు ఉత్తీర్ణులై 97.67శాతంతో బాలికలే పై సాధించారు. గత సంవత్సరం 96శాతం ఉత్తీర్ణత సాధించి 17వ ర్యాంక్‌ ఈ సంవత్సరం 20వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం మెరుగైందని డీఈవో యాదయ్య తెలిపారు.

Updated Date - Apr 29 , 2026 | 11:51 PM