Share News

లావణ్య త్రిపాఠికి వేధింపులు.. ఇన్‌స్టాగ్రామ్‌కు పోలీసుల లేఖ

ABN , Publish Date - Mar 11 , 2026 | 10:33 AM

లావణ్య త్రిపాఠిపై వేధింపుల కేసును పోలీసు శాఖ సీరియస్‌గా తీసుకుంది. సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. లావణ్య త్రిపాఠిని ఆన్‌లైన్‌లో వేధించిన ఇన్‌స్టాగ్రామ్ ఐడీ వివరాలు ఇవ్వాలని కోరుతూ ఇన్‌స్టాగ్రామ్‌కు మెయిల్ పంపారు.

లావణ్య త్రిపాఠికి వేధింపులు.. ఇన్‌స్టాగ్రామ్‌కు పోలీసుల లేఖ
Lavanya Tripathi harassment case

హైదరాబాద్, మార్చి 11: సోషల్ మీడియాలో వేధింపులపై ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి సైబర్‌ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ‘Purple Crayon00’ ద్వారా తనపై దూషణలు, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నట్టు లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యక్తిగత జీవితం, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పోస్టులు చేసినట్టు తెలిపారు. అసభ్య పదజాలంతో కామెంట్లు, పరువు నష్టం చేసే ప్రచారం చేస్తున్నారని లావణ్య ఆరోపించారు. అసభ్యకరమైన పోస్టులు తొలగించాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.


ఇన్‌స్టాగ్రామ్‌కు పోలీసుల లేఖ

లావణ్య ఫిర్యాదుతో పాటు ఆధారాలుగా 11 స్క్రీన్ షాట్స్‌ను పోలీసులకు ఇచ్చారు. నిందితుడు తనను 11 వారాలుగా వేధిస్తున్నట్లు వెల్లడించారు. లావణ్య త్రిపాఠిపై వేధింపుల కేసును పోలీసు శాఖ సీరియస్‌గా తీసుకుంది. సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. లావణ్య త్రిపాఠిని ఆన్‌లైన్‌లో వేధించిన ఇన్‌స్టాగ్రామ్ ఐడీ వివరాలు ఇవ్వాలని కోరుతూ ఇన్‌స్టాగ్రామ్‌కు మెయిల్ పంపారు.


ఇవి కూడా చదవండి

యుద్దం కాదు.. శాంతిని కోరుకుందాం

పానిక్ హార్వెస్టింగ్ చేయొద్దు.. రొయ్యల రైతులకు మంత్రి సూచన

Updated Date - Mar 11 , 2026 | 10:38 AM