Share News

ఐదేళ్ల నౌకరీకే ఫాం హౌస్‌.. 3 స్టార్‌ హోటళ్లా..?

ABN , Publish Date - Oct 03 , 2026 | 04:31 AM

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అమెరికాలో ఐదేళ్లు నౌకరీ చేస్తే మూడు ఫైవ్‌స్టార్‌ హోటళ్లు, 100 ఎకరాల్లో ఫాం హౌస్‌ ఎలా వస్తాయని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి నిలదీశారు.

ఐదేళ్ల నౌకరీకే ఫాం హౌస్‌.. 3 స్టార్‌ హోటళ్లా..?
KOMATIREDDY VENKAT REDDY

  • కేటీఆర్‌ను నిలదీసిన మంత్రి కోమటి రెడ్డి

నల్లగొండ, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అమెరికాలో ఐదేళ్లు నౌకరీ చేస్తే మూడు ఫైవ్‌స్టార్‌ హోటళ్లు, 100 ఎకరాల్లో ఫాం హౌస్‌ ఎలా వస్తాయని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి నిలదీశారు. ఇప్పటికైనా స్టార్‌ హోటళ్లు, ఫాం హౌస్‌లు విక్రయించి, దాంతో వచ్చిన డబ్బు ప్రజలకు పంచి పెట్టి.. ఆ తర్వాత సామాన్యులుగా ప్రజల్లోకి వచ్చి రాజకీయాలు చేయాలని హితవు పలికారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం నల్లగొండలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వచ్చిన కరువుతో రైతులు ఇబ్బంది పడుతుంటే.. బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు రాక్షసానందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. త్వరలో జరిగే 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలువ బోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు ఎన్ని కల్లబొల్లి కబుర్లు చెప్పినా ఎవరూ నమ్మబోరని స్పష్టం చేశారు. మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - Oct 03 , 2026 | 04:51 AM